పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/202

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

రూపొందించారు. అ సందార్భంగా హాజౌరాకు జనచైతన్య కార్యక్రమాల నిర్వహణా బాధ్యాతలను ఆయన అప్పగించారు. ఆమె భర్త డాక్టర్‌ అహమ్మద్‌కు ఆర్థిక విభాగం బాధ్యాతలను కాేయించారు. బేగం హాజౌరా ఈ అవకాశాన్ని వినియోగించుకుని, అవిశ్రాంతంగా పలు ప్రాంతాలు పర్యించి, తన ప్రసంగాలతో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చెతన్య పర్చారు. ప్రదానంగా మహిళలను ఉద్యమింప చేయటంలో ఆమె సాధించిన ప్రగతి ఎందారికో ఆదార్శప్రాయమైంది.

ఆనాడు జరిగిన పలు ఎన్నికలలో పాల్గొని, భారత జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుకు హజౌరా బేగం కారణమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో పాల్గొని తన అభిప్రాయాలను నిష్కర్షగా వ్యక్తం చేసి నాయకుల, ప్రజల ప్రశంసలను అందుకున్నారు. ఆమె కొంతకాలం కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ సభ్యురాలిగా బాధ్యతలను నిర్వహించారు. ఆనాడు వామపక్ష భావాలు గల భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులుగా హాజౌరా దంపతులు గుర్తించబడ్డరు.1937 మే లో ఆంధ్రాప్రదేశ్‌లోని కొత్తపట్నంలో జరిగిన రాజకీయ శిక్షణా శిబిరంలో అధ్యాపకురాలిగా పాల్గొన్న బేగం హాజౌరా రాష్ట్ర ప్రజలకు కూడ సుపరిచితురాలు.(ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధులు పరకాల ప్టాభి రామారావు (విజయవాడ) గారి నుండి సమాచారం)

చిన్ననాటి నుండి ఎటువింటి లింగ వివక్షతను అంగీకరించని మనస్తత్వంగల హాజౌరా ఆ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాలు చేయడానికి వెనుకాడలేదు. 1938 ప్రాంతంలో ఆమె కుమార్తె సలీమా గర్భంలో ఉన్నప్పుడు ప్రసవం నిమిత్తం అలహాబాద్‌ లోని ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆంగ్లేయులకు మేలు రకం సౌక్ర్యాలు, భారతీయులకు నాసిరకం ఏర్పాట్లు జరుగుతున్న తీరును చూసి గర్భవతైయుండి కూడ ఆ వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రసవం నిర్వహిస్తున్న డాక్టరకు సహకరించేందుకు నర్సింగ్‌ విభాగంలో మహిళలు కాకుండ పురుషులు మాత్రమే ఉండటం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో మహిళా నర్సులను నియమించాలని హాజౌరా డిమాండ్‌ చేశారు. నర్సింగ్‌ విభాగంలో మహిళల ఏర్పాటు జరిగేంత వరకు ఆమె విజయవంతంగా ఆందోళన చేశారు. ఆ ఆందోళనకు మహిళల నుండి మంచి మద్దతు లభించింది. ప్రజాందోళన తీవ్రతరం కావటంతో ఆ విషయంలో పండిత జవహర్‌ లాల్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. (మేరే జీవన్‌ కీ కుచ్‌ యాదేౌ (హిందీ) ó పేజీ.166-168) 199