పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

భర్త, కూతురుతో హాజౌరా

లభించింది. లండన్‌లో ఓసారి జరిగిన మేడే సందర్భంగా ఆమె ఎర్రజెండా చేతపట్టి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, ఊరేగింపు అగ్రభాగాన నిలబడి సహచరులను సహితం ఆశ్చర్యచకితులను చేశారు.

ఇటలీలో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. అంతేకాకుండ బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, యుద్ధాన్నివ్యతిరేకిస్తూ బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఆమె భారతీయ ప్రతినిధిగా భాగస్వామ్యులయ్యారు. ఆ క్రమంలో 1935లో భారతీయ విద్యార్థి బృందంలో సభ్యురాలిగా హాజౌరా బేగం సోవియట్ రష్యాకు వెళ్ళారు. ఈ విధంగా రష్యా సందర్శించిన మొట్టమొదటి భారతీయ ముస్లిం మహిళగా బేగం హాజౌరా ఖ్యాతి గడంచారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan : Page. 281)

లండనలోని మాంటిస్సోరీ కళాశాలలో డిప్లొమా పూర్తయ్యాక హాజౌరా ఇండియా తిరిగి వచ్చారు. ఇండియా రాగానే 1935లో లక్నోలోని కరామత్‌ హుస్సేన్‌ బాలికల

197