పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తూ క్షణమొక యుగంగా ఆమె గడపసాగారు. చివరకు సమాధానం వచ్చింది. ఆ లేఖలో మిమ్మల్ని ఆశ్రమంలో చేర్చుకోలేము. ఆశ్రమ జీవితం చూడలనుకుంటే మాత్రం మీరు అతిధులుగా ఇక్కడకు రావచ్చును అని పేర్కొన్నారు. అతిథిగా అనుమతించటమే చాలనుకుస్న్న ఆమె సబర్మతి వెళ్ళేందుకు సోదరులను డబ్బు అడగకుండ బలవంతంగా అమ్మ ధరింపచేస్తుస్న్న ఆభరణాలను విక్రయించి, వచ్చిన డబ్బును ప్రయాణఖర్చులకు ఉపయాగించుకుని ఆశ్రమం చేరారు. ఈ విధగా గాంధీజీ సన్నిహిత వరంలో స్థానం పొంది, స్వాతంత్రోద్యామ చరిత్రలో ప్రత్యే కతను సంతరించుకున్న గాంధేయవాది అమతుస్సలాం ఆటంకాలన్నీ అధిగమించి తన 25 సంవత్సరాల వయస్సులో సబర్మతీ ఆశ్రమనివాసి అయ్యారు.

ఆశ్రమపు కఠిన నియమనిబంధాలను పాటిస్తూ, అంకితభావం, నిబద్ధత, సేవాతత్పరతతో, చక్క ని క్రమశిక్షణతో ఆశ్రమవాసులలో ఒకరిగా ఆమె ఇమిడిపోయారు. ఆ క్రమంలో ఆమె శ్రీమతి కసూర్బాకు, మహాత్మాగాంధీకి కన్నబిడ్డ సమానమయ్యారు. ఆ దంపతులకు కస్న్నకూతురుగా సేవలందించారు. ఆశ్రమంలో అతిధిగా ఆహ్వానించబడిన ఆమె చివరకు ఆశ్రమ సేవికయ్యారు. ఒక ప్రసిద్ధ ముస్లిం రాజపుఠానా జాగీర్దార్‌ కుటుంబానికి చెందిన అమ్మాయి ఆశ్రమంలో చేరి అవివాహితగా జాతీయోద్యమానికి తనను తాను సమర్పించుకోవటం ఆనాడు ఊహించని సంఘటన.

అమతుస్సలాం అన్ని కష్టాలను-నష్టానలను, ఆనారోగ్యం కారణంగా ఏర్పడిన శారీరక బలహీనతలను దృఢ సంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురా లయ్యారు. మహాత్ముని ప్రియమైన పుత్రిక గా ఖ్యాతిగాంచారు. 1922లో గాంధీజీ సబర్మతీ ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో మహాత్ముని అనుమతితో అనారోగ్యాన్ని ఏమాత్రం లెక్కచేయక ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె కూడ జైలు కెళ్ళారు. ఆమె జైలు నుండి విడుదల కాగానే సేవాగ్రాం వచ్చి బాపూజీకి వ్యకిగత సహా కురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పాత్రలో ఆమె గాంధీజీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అన్ని సందర్భాలలో, అన్ని పర్యటనలలో ఆయన వెంట ఉన్నారు.

బాపూజీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్ళిన సందర్భంగా అమతుస్సలాం తన జీవితంలోని అతి ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా, స్వరాజ్య సాధనతోపాటుగా హిందూ -ముస్లిల ఐక్యత, హరిజనుల సంక్షేమం తన జీవిత లక్ష్యమని ప్రకించారు. ఈ విషయం తెలుసుకుస్న్న బాపూజీ ఆమెకు లేఖ రాస్తూ నీవు సేవా 190