పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/183

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


సందర్భంగా ఆ సమావేశంలో ఆమె ప్రధాన పాత్ర వహించారు. 1930 ఏప్రిల్‌ 11న రెహానా తయ్యాబ్జీకి గాంధీజీ ఓ లేఖ రాస్తూ మధ్యపానం, విదేశీ వస్తువుల బహిష్కరణ తదితర అంశాల మీద గుజరాత్‌ మహిళల సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశానికి నీవు, మీ అమ్మగారు తప్పక హాజరుకావాలి అని కోరారు. ఆ సమావేశానికి రెహానా తన తల్లి అమీనా తయ్యాబ్జీతోపాటుగా హజరయ్యారు.

భారతదేశానికి మార్గదర్శకమైన ఈ ఉద్యామం సందర్భంగా మహిళలను సంఘితం చేసేందుకు రెహానా ప్రత్యేక బాధ్యాతలు స్వీకరించి ఆ బృహత్తర భూమికను నిర్వర్తించారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ యువజన విభాగం యూత్‌ లీగ్‌కు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఆ హోదాలో మహాత్ముని ఆదేశాల మేరకు ఆమె పలు కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఈ ఉద్యామం సందంర్బగా ఆమె పలుమార్లు అరెస్టయ్యారు.

ఈ ఉద్యమం నేపధ్యంలో గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ పక్షాన సమావేశం తీర్మానాలను ప్రభుత్వానికి ఎరుకపర్చేందుకు రెహానా తయ్యాబ్జీ, అమీనా తయ్యాబ్జీ, ఆమనా ఖురేషి సంతకాలతోపాటు మొత్తం మీదా 24 మంది మహిళల సంతకాలతో కూడిన మహాజరును వైశ్రాయికి పంపారు. ఆ మహాజరులో రహానా తయ్యాబ్జీ సంతకాన్ని కూడ గాంధీజీ కోరడం ద్వారా ఆమె ప్రాధాన్యత వెల్లడయ్యింది.

1942 నాటి ఖ్విట్ ఇండియా ఆందోళనలో ఆమె క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తున్న ఆమెను ప్రభుత్వం అరెస్టు చేసి సంవత్సరం జైలు శిక్షకు గురిచేసింది. స్వాతంత్య్రోద్యమ సైనికురాలుగా ఆమె లాఠీ దెబ్బలను, జైలు శిక్షలను అనుభవించారు. అరెస్టులు, లాఠీ దెబ్బలు, జైళ్ళు, స్వాతంత్య్రోద్యమకారులకు సత్కారాలుగా భావించిన రెహానా తయ్యాబ్జీ చివరి వరకు జాతీయోద్యమంలో విరామమెరుగక పాల్గొన్నారు.

సర్వమానవ సోదారభావానికి, విస్వశాంతి పరిరక్షణకు, బానిసత్వం నుండి మాతృదేశం విముక్తి కోసం చివరి క∆ణం వరకు ఉద్యామించిన బేగం రెహానా తయ్యాబ్జీ 1975 మే 16న అవివాహితగా కన్నుమూశారు.

180