పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/173

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


వలయాకారంగా తిరగటం. ఉద్యానవనపు శోభను తిలకించటం. కొమ్మల ఆకుల్లో సంతోషంతో కేరింతలు. చల్లని గాలులతోబాటు చప్పట్లు చరచడమూ.

నా ప్రాణాలు వెలిగినా నా గుండె మాడిపోయింది. నా వక్షంలో వేదానా జ్వాల ఆగ్నిని నింపింది. ఈ చిన్న పంజరంలో బందీగా మారాను. నా ఆనాటి గూటి తాలూకు స్వేచ్ఛ ఎక్కడికి పోయింది? ఇష్టం వొచ్చినపుడు రావడమూ. ఇష్టమైనపుడు పోవడమూను.

నా ఈ అసహాయతని ఎవరికి చెప్పేను ? నా రాత నాకు రోజూ కొత్త బాధల్ని తెస్తూంది. దెబ్బతిన్న రెక్కలతో విషాదగానం చేస్తునన్నాను. మంచు వేకువలొచ్చి పూల మోము కడగటం గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెపై దెబ్బపడుతోంది.

ఆనాటి నాగూటి రూపు నా కళ్ళల్లోనే తిరుగుతూంది. సంతోషాన్నీ, హాయినీ ఎక్కడ వెతికేను? జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా హృదయంలో వో భయం కలుగుతోంది. అందమైన ఆ రూపం ఆ చక్కటి ఆకారం. వాటితోనే గదా ఆనాడు వెల్లివిరిసే నా గూటి అందాలు ! నక్షత్రాలతో సంభాషణ అను మరో కవితలో-

ఈ వసంత దృశ్యం ఎంత హాయిగా ఎంత అందంగా వుంది. కాని నా గుండెల్ల్లో దాగిన భావనలు బయటికి రాలేకపోయాయి. నాకు మీతో గాని, మీ ఆకాశంతో గాని ఏ ఆవసరం లేదదు. నా దేశం, నా భారత దేశం గురించే నా చింత ఆంతాను. ఆ రోజు దేవుడు ఏనాటికైనా నా కళ్ళకు చూపిస్తాడా? భారత దేశం ఆనాడు మీలాగే వెలుగులు విరజిమ్ముతుందా ?

సమకాలీనులు ఆశ్చర్యంతో చూస్తారు నా భారతదేశాన్ని-దాని వెలుగులు మురిపిస్తాయి సకల ప్రపంచాన్ని-నా ప్రియమైన దేశంపై బలవుతాను నేను- ప్రభూ ఈ మోడువారిన వనంలో వసంతాన్ని రప్పించు.

అని ప్రభువును వేడుకుంటూ సాదాత్‌ బానో నక్షత్రాలతో సంభాషణ సాగించారు. ఈ విధంగా ఆమె రాసిన ప్రతి కవితలో దేశభక్తి భావనలు వ్యక్తంచేస్తూ స్వేచ్ఛా- స్వాతంత్య్రకాంక్షంలతో, మాతృభూమి ఉజ్వల భవిషత్తును కాంక్షించారు.

1914 ప్రాంతంలో పంజాబు ప్రజలు రౌలత్‌ చట్టం వలన ఇక్కట్లు పడసాగారు. ఎప్పుడు ఎలా అరెస్టులు జరుగుతాయో, ఎప్పుడు ఎవరు అరెస్టవుతారో, ఏ స్వాతంత్య్ర సమరయాధుని ఇంటిమీద పోలీసు మూకలు విరుచుక పడుతాయో, ఎంతి విధ్వసం సృష్టిస్తారో, ఏ వ్యక్తి ప్రాణానికి ఎప్పుడు ప్రమాదం ముంచుకు వస్తుందో, ఏ రాత్రిపూట 170