పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/172

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


సోదరులు గోవును ఆరాధిస్తారు కనుక వారి మనోభావాలను గౌరవించాలన్న ఉదేశ్యంతో ఆమె తన కుటుంబంలో గోమాంసం వంటకాలను పూర్తిగా నిషేధించారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan, Dr. Abida Samiuddin, IOS, New Delhi,1997, Page.162)

ఆమె చక్కని కవయిత్రి, మంచి రచయిత్రి. ఉద్యమకారులను ఉత్తేజపరుస్తూ బ్రిటిషు ప్రభుత్వపు రాక∆స రాజకీయ క్రీడల వెనుకగల కుయుక్తులను ఎండగడ్తూ పలు కవితలు రాశారు. ఈ విషయంలో ఆమె మౌలానా ఆజాద్‌ మార్గంలో పయనించారు. ఉర్దూ, పర్షియన్‌ భాషల మీద మంచి ఆధిపత్యం ఉన్న ఆమె కవితలు మాత్రమేకాదు, నవలలు కూడ రాశారు. ఆమె రాసిన కవితలు దక్కన్‌ రివ్యూ, తెహజీబ్‌-యే-నిసా, ఖాతూన్‌ లాంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. తెహజీబ్‌-యే-నిసా లో ఆమె మహిళల సమస్యల మీదా ప్రగతిశీల పరిష్కారాలతో నవల రాశారు. 1910లో రాసిన ఆ నవల సీరియల్‌గా ప్రచురితమైంది. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద ప్రత్యేక శీర్షికలతో 1910-12 సంవత్సరాలలో అసంఖ్యాకంగా ఆమె ప్రత్యేక ఫీచర్స్‌ రాశారు. ఈ కవితలు, వ్యాసాలు, ఫీచర్స్‌లలో ఆమెలోని దూరదృష్టి, విసృత అధ్యాయనం వెల్లడవుతాయి. సమకాలీన సమాజం, జాతీయ అంతర్జాతీయ ప్రపంచం తీరుతెన్నులను, ఆయా రాజకీయ వ్యవస్థలను అర్థ్ధం చేసుకునేందుకు ఆమె ప్రత్యేకంగా ఆంగ్ల భాషను కూడ నేర్చుకుని ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యాయనం చేశారు.

1910లో తన 18 సంవత్సరాల వయస్సులో ఆమె దేశభక్తి ప్రపూరితమైన కవితలు రాశారు. ఓ కవితలో బానిస బంధానాలలో బందీ అయిన తన దేశం గురించి, స్వేఛ్చను కోల్పొయిన దేశ ప్రజల గురించి ఆవేదాన వ్యక్తంచేశారు. ఆ కవిత ఈ క్రింది విధాంగా సాగింది-

హృదయమా ! నాదుóఖ గాథను ఎవరికి వినిపించేను ? పూదోట నుంచి నా నివాసం పంజరంలోకి మారింది. నా గుండెలపై బాధల కొరడ దెబ్బలు పడుతున్నాయి. గతకాలం నాకు జ్ఞప్తికొస్తూంది. ఆ పూదోటలోని వృక్షాలు, ఆ నా చిన్నిగూడునూ-

పంజరంలోంచి ప్రపంచపు స్వాతంత్య్రాన్ని చూస్తూన్నాను. నా గూడు గుర్తు కొసూంది. బందీనెవున్నాను. అరిచే శకలదు. ఆ గుంపుగా ఎగరడం, ఆ ఆకాశ విహారం, ఆ తోటలో వసంతాలు. ఆ పాటల సవ్వడులూనూ.

నా ఆనందాపు ఆ రోజులు ఇప్పుడెక్కడికి పోయాయి. ప్రభూ! పూదోటలో ఎగిరి 169