పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/168

ఈ పుట ఆమోదించబడ్డది

ఆచరణాత్మక త్యాగశీలి

సుగరా ఖాతూన్‌

(-1968)

జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అత్యంత ఆసక్తి చూపటమే కాక లోతైన అధ్యాయనంతో జ్ఞానపరంగా పరిణతి చెందిన మహిళలు జాతీయోద్యమంలో ఎందరో కన్పిస్తారు. అటువిం మహిళా మేధవులలో ఒకరు శ్రీమతి సుగరా ఖాతూన్‌.

ఆనాడు నిజాం సంస్థానంలో భాగంగా ఉన్న ఉస్మానాబాద్‌లో సుగరా ఖాతూన్‌ జన్మించారు. ఆమె తల్లి సైదాున్నీసా, తండ్రి సయ్యద్‌ హదీ. పదామూడు సంవత్సరాల వయస్సులో జమీందారీ కుటుంబానికి చెందిన మహమ్మద్‌ జమీర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన ఆరు సంవత్సరాలకే భరను కోల్పోయి వితంతువయ్యారు. ఆ తరువాత అత్తింట తలెత్తిన ఆస్థి వివాదాల కారణంగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉంటున్న తన మేనమామ ఇంట చేరారు.

ఆ సమయంలో ఖిలాఫత్‌ సహాయనిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ వివరాలను ఆమె ఎప్పికప్పుడు తెలుసుకుంటున్నారు. ఉద్యామ వార్తలు ఆమెను నిలువనివ్వటం లేదు. ఆమెలోని దేశభక్తి భావనలు ఆమెను ఊపిరి సలుపనివ్వటం లేదాు. నిర్ల్లిప్తంగా కూర్చోనివ్వటంలేదు. ఆ పరిస్థితులలో ఆమె జాతీయోద్యమంలో ప్రవేశించారు. విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా అత్యంత విలువైన తన వస్త్రాలను 165