పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


భారత దేశం వెళ్ళాలన్న నిర్ణయం తీసుకోడనికి ఇమాం సాహెబ్‌కు క్షణం పట్టలేదు. సత్యాగ్రహం, హిందూ-ముస్లింల ఐక్యతల కోసం ఆయన చేసిన మహాత్యాగమిది. సబర్మతీ ఆశ్రమంలోని ప్రతి ఒక్కరికీ ఆయన దినచర్య గురించి తెలుసు... అల్లా పట్ల అధిక శ్రద్ధాళువైన ఆయన హృదాయంస్వచ్ఛమైనది. ఆశ్రమ నియమ నిబంధానల పట్ల ఆయన విశ్వాసం మరింత దృఢం కాసాగింది. (Collected works of Mahathma Gandhi, Govt. of India Publications and Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan : Page. 225 )

ఆ విధంగా దాక్షిణాఫ్రికా నుండి భారతదేశంలోని సబర్మతి ఆశ్రమం చేరిన ఇమాం సాహెబ్‌ కుటుంబంలోని చిన్న కుమార్తె ఆమనా. 1914లో సబర్మతి ఆశ్రమానికి వచ్చేసరికి ఆమె వయస్సు సుమారు తొమ్మిది సంవత్సరాలు. ఆమె ఆశ్రమంలో గాంధీజీ పర్యవేక్షణలో పెరిగారు. ఇమాం కుటుంబం అలనాటి సంపన్న జీవితాన్ని విస్మరించి కరినతరమైన ఆశ్రమ జీవితం స్వీకరించింది. ఆశ్రమ వాతావరణంలో ఆమనాకు మహాత్మా గాంధీ ప్రేమాభిమానాల తోపాటుగా ప్రముఖ జాతీయోద్యామకారుల పరిచయ భాగ్యం దాక్కింది. ఆ ప్రభావం, తల్లితండ్రుల త్యాగగుణాలను సంతరించుకున్న ఆమె అతి సహజంగా జాతీయ భావాలను పుణికపు చ్చుకున్నారు. ఆశ్రమంలో ఉంటూ జాతీయోద్యామ కార్యక్రమాలలో భాగసస్వాములయ్యారు. మహాత్ముని నిర్దేశంలో ఆమె పలు బాధ్యాతలను నిర్వహించారు.

జాతీయోద్యామంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న యువ ఉద్యామకారులు, గుజరాత్‌కు చెందిన గులామ్‌ రసూల్‌ ఖురేషిని ఆమనా వివాహం చేసుకున్నారు. 1924 మే 31న జరిగిన ఈ వివాహాన్ని ఇమాం సాహెబ్‌ సోదారుని హోదాలో గాంధీ జీస్వయంగా నిర్వహించారు. మహాత్ముడు అవిశ్రాంతంగా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నా ఆమనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆమెకు ఎటువిం అసౌకర్యం కలుగకుండ చూశారు. ఆమెనుస్వంత బిడ్డలా పరిగణించిన మహాత్ముడు ఆప్యాయతను అందించారు.

భర్త గులాం రసూల్‌తోపాటుగా జాతీయోద్యామంలో ప్రత్యక్షంగా పాల్గొని తండ్రి, భర్తలతోపాటుగా తాను జైలుకెళ్ళాలని ఆమనా ఖురేషి ఎంతగా ఆకాంక్షించినా ఆమెకు గాంధీజీ అనుమతి అంత త్వరగా లభించలదు . ఆశ్రమంలోని మహిళలను జైలుకెళ్ళడానికి అప్పట్లో గాంధీజీ అంగీకరించలేదు. ఆ కారణంగా తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా 162