పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/163

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఇమామ్‌ ఖాదిర్‌ గాంధీజీకి క్రియాశీలక సహకారం అందించారు. లక్షలాది రూపాయల లాభాలు ఆర్జించిపెట్టే భారీ వ్యాపారాన్ని త్యజించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగస్వామ్యం వహించేందుకు కుటుంబంతో సహా గాంధీజీ వెంట ఆయన ఇండియా వచ్చేయగా ఏడు సంవత్సరాల వయస్కురాలైన ఆమనా కూడ తల్లితండ్రుల వెంట తరలివచ్చారు.

స్వాతంత్య్రోద్యమంలో ఆమనా ఖురేషి త్యాగమయ పాత్రను తెలుసుకునే ముందు ఆనాడు దక్షిణాఫ్రికాలో ఆమె కుటుంబ పరిస్థితులు, అక్కడ వర్ణవివక్షతకు వ్యతిరేకంగా గాంధీజీతో కలసి ఆ కుటుంబీకులు సాగించిన పోరాటం, ఆ తరువాత భారత దేశానికి రావటం, ఇక్కడ పరిస్థితులకు ఆ సంపన్న కుటుంబ సబ్యులు అలవాటైన విధానం తెలుసుకోవాల్సి ఉంది. ఈ పరిసితు లను మహాత్మా గాంధీ ఈ క్రింది విధంగా వివరించారు.

దక్షిణాఫ్రికాలో ఇమాం గారిల్లు ఆంగ్లేయుల పద్థతిలో నిర్మాణమైంది. ఇమాం గారి భార్య చిన్నప్పటినుండి ఆంగ్లేయ రీతిరివాజులతో కూడిన జీవితాన్ని అనుసరిస్తున వ్యక్తి. ఫాతిమా, ఆమనా వారి కుమార్తెలు. ఆంగ్లేయ పిల్లల పద్దతులలో వారిరువురి పెంపకం సాగింది. సర్వ సుఖభోగాల ఐశ్యర్యవంతమైన జీవితాన్ని త్యజించి ఫకీరు జీవితాన్ని అవలంభించటం సులభవున పని కాదు. ఒక్కసారి దృఢసంకల్పం చేసుకున్నాక ఇమాం గారికి అది ఏమాత్రం పెద్దపని కాదు. నేను జోహన్స్‌బర్గ్‌ వదలి ఫోనిక్స్‌కు నివాసం మార్చగానే ఇమాం సాహెబ్‌ కూడ నాతోపాటుగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన దృఢనిశ్చయం గురించి ఎరిగి ఉండి కూడ ఆయనకు ఏ విధగా జవాబివ్వాలన్నాఆందోళనలో ఉండేది. జీవితంలో ఎటువంటి కష్టంనష్టం ఎరుగని వ్యక్తి అనంత ఐశ్వర్యాన్ని వదలి ఫోనిక్స్‌లో ఒక మజ్దూర్ గా జీవితం ఎలా గడపగలరు. ఆయనకు ఫోనిక్స్‌ కఠోర జీవితం గురించి తెలిపాను. ఫోనిక్స్‌ రాడనికి మీరు స్వయంగా నిర్ణయించుకున్నట్టయితే హాజీ సాహెబా (ఇమాం గారి భార్య), కుమార్తెలు ఫాతిమా, ఆమనా సంగతేంటని ప్రశ్నించా. అందుకు సమాధానంగా 'నాకు భగవంతుని మీద పూర్తి విశ్వాముంది. మీరు హాజీ సాహెబాను పూర్తిగా ఎరుగరు. నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నాఅక్కడ ఉండేందుకు ఆమె సదా తయారుగా ఉంటారు. మన సంఘర్షణ అంతం ఎప్పుడో మనకెవరికీ తెలియదు. నా గుర్రాల వ్యాపారాన్ని నేను ఇంకా కొనసాగించ 160