పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

చేసింది. విద్యకోసం ప్రత్యేకించి స్త్రీవిద్య కోసం అవిశ్రాంతంగా ఆమె చేసిన కృషికి 'నెహ్రు˙ లిటరసీ అవార్డు' లభించింది. ఫాతిమా ఇస్మాయిల్‌ దళితుల అభ్యున్నతి కోసం చేసిన కృషికి గుర్తింపుగా 'దళిత మిత్ర' అవార్డు పొందింది. హాజౌరా ఆపా కార్మిక కర్షక సంక్షేమానికి చేసిన కృషికి లెనిన్‌ శతజయంతి ఉత్సవాలలో 'సుప్రీం సోవియ్‌ జూబ్లీ అవార్డు'తో గౌరవించబడింది. ఫాతిమా యఫ్‌ ఈయ్యాబ్‌ అలీ కూడ గాంధేయ మార్గంలో నడుస్తూ స్వాతంత్య్రానంతర భారతదశంలో గుజరాత్‌లోని 'పడలా' గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దింది. అందుకు భారతప్రభుత్వం విశిష్ట మహిళగా ఆమెను గుర్తించింది. స్వతంత్య్ర భారత దేశంలో రాజకీయ రంగ ప్రవశం చేసి అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా బాధ్యాతలను నిర్వహించిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాసుమా బేగం రాష్ట్రంలో మంత్రి పదవిని చేపట్టి దేశంలో మంత్రి పదవి చేపట్టిన తొలి ముస్లిం మహిళగా ఖ్యాతి గడించారు. సఫియా అబ్దుల్‌ వాజిద్‌, బేగం అక్బర్‌ జహాన్‌ బేగం, అనీస్‌ బేగం కిద్వాయ్‌ లాింటి వారు పార్లమెంటు సబ్యులయ్యారు.బేగం షరీఫా హమీద్‌ అలీ ఐక్యరాజ్యసమితి మహిళా విభాగానికి భారతదశ ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ విధంగా ఉద్యామబాటన నడిచిన ఈ స్త్రీల జీవితాలను అధ్యయనం చేసనప్పుడు వాళ్ళు ఎటువంటివిలువల కోసం పాటుపడ్డారో అవి ఎంత ఉన్నతమైన, ఉదాత్తమైన మానవీయ విలువలో అర్దమవుతుంది. ఎటువంటి కష్టానికీ తలవంచక పోవటం, ధైర్యంగా నిలబడడం, దుర్బర దారిద్య్రాన్నిఅనుభవించటానికైనా సిద్ధపడడం,తాము చెప్పేదే ఆచరించటం, అరెస్టు కాకపోవటాన్ని నామోషీగా భావించటం,బ్రిీటిష్‌ ప్రబుత్వానికి విన్నవించుకోవటాన్ని చిన్నతనంగా పరిగణంచటం, క్షమాబిక్షను కోరటానికి బదులు ప్రాణాలు అర్పించడానికి సంసిద్దులు కావడం, తమ ప్రాణాలు 'జాతి సొత్తులు' అని ప్రకంచడం మొదలైనవన్నీ వాళ్ళ ఆత్మాభిమానానికి, త్యాగనిరతికి అద్దా పడతాయి. వస్తు వినిమయ విష సంస్కృతిలో పడికొట్టుకుపోతున్న ప్రస్తుత యువత తప్పనిసరిగా చదవవలసిన పుస్తకమిది. ఈ పుస్తకం ఇటు స్త్రీల చరిత్రనూ, అటు ముస్లింల చరిత్రనూ సుసంపన్నం చేస్తుంది. జాతీయోద్యమంలో పాల్గొన్నముస్లిం మహిళల భారతీయతను స్పష్ట చేస్తుంది. హిందూ ముస్లింలు ఐక్యతతో స్వతంత్య్ర భారతదశాన్ని సాధించుకున్నారన్న విషయంవెల్లడి చేస్తుంది. గ్లోబలైజేషన్‌ సంస్కతిలో,

13