పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/158

ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుత కార్యాచరణతో అందర్ని ఆకట్టుకున్న మహిళానేత

సయ్యద్‌ కనీజ్‌ బేగం

(1890-1955)

జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళలు సత్యాగ్రహోద్యమమైనా, సాయుధ పోరాటమైనా ఏమాత్రం నుకాడలేదు. బ్రిటిష్‌ వ్యతిరేకపోరాటంలో మహిళలు తమప్రత్యేక ప్రతిభా సామర్థ్యాలను చూపారు. ఈ మేరకు అద్బుత ప్రసం గాలతో ప్రజలనుఆకట్టు కోవటమేకాకుండ, తన కార్యాచరణతో ఉద్యమ వ్యాప్తికి తోడ్పడిన మహిళా ప్రముఖు లలో శ్రీమతి సయ్యద్‌ కనీజ్‌ బేగం ఒకరు.

1890లో బీహార్‌ రాష్ట్రంలో సయ్యద్‌ కనీజ్‌ బేగం జన్మించారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు సయ్యద్‌ ముబారక్‌ హుస్సేన్‌ మనుమరాలు. బీహార్‌ రాష్ట్రకాంగ్రెస్‌ నేత సయ్యద్‌ సలావుద్దీన్‌ కనిష్ట సోదరి. చిన్న వయస్సులోనే ఉర్దూ, అరబ్బీ ,పర్షియన్‌ భాషలలో ఆమె మంచి తర్పీదు పొందారు.సోదరుడు సయ్యద్‌ సలావుద్దీన్‌సహచర్యం వలన ప్రముఖ జాతీయోద్యమ నేతలు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌,మహాత్మాగాంధీ, మౌలానా ముహమ్మద్‌ అలీ, మౌలానా షాకత్‌ అలీల ఆలోచనలతో ఆకర్షితులయ్యారు. ఆ ప్రభావంతో భారత జాతీయ కాంగ్రెస్‌ క్రియాశీలక సభ్యత్వంస్వీకరించి బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల దిశగా ముందుకు సాగారు.

155