పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/155

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


భాగంగా దావూది ఇంటికి తరచుగా వచ్చేవారు. ఆ సందర్భంగా ఆమెను కలవటానికి వచ్చిన ప్రముఖులతో జరుగు చర్చలు, సభలు-సమావేశాలలో ఆమె చేస్తున్న ప్రసంగాల ద్వారా వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు జుబైదా బేగంను బాగా ప్రభావితం చేశాయి.

మౌలానా షఫీ దావూది ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహాత్ముని పిలుపు మేరకు తన ఇంట కనక వర్షం కురిపిసున్న న్యాయవాద వృత్తిని వదిలి జాతీయోద్యమానికి ఆయన పూర్తిగా అంకితమయ్యారు. భారీ ఆదాయాన్ని ఒక్కసారిగా వదాలుకోవటంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఇక్కట్లను భరిస్తూనే, జాతీయోద్యామకారులు దావూదితోపాటుగా జుబైదా బేగం జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించి ఆయన వెంట ముందుకు సాగారు.

జుబైదా ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఆనాటి నుండి దావూదితో కలిసి దాస్యవిముక్తి కోసం సాగుతున్న పోరులో క్రియాశీలక పాత్ర వహించారు. ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమంలో అవిశ్రాంతంగా శ్రమిసున్నభర్తకు అన్నివిధాల సహాయకారిగా నిలచారు. అత్యంత క్లిష్ట సమయాలలో భర్త బాధ్యతలను తాను స్వీకరించి సమర్థతతో నిర్వహించారు.

ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమంలో పోలీసులు మౌలానా షఫీ అహమ్మద్‌ గృహం షఫీమంజిల్‌ మీద ఆకస్మిక దాడిచేసి ఆయనను నిర్భంధంలోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన జుబైదా బేగంను పిలచి, తిలక్‌ మైదానంలోని కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్ళ మని సూచించారు. ఆ సూచన మేరకు జుబెదా బేగం హుటాహుటిన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్ళి భర్త స్థానంలో నాయకత్వపు బాధ్యతలు చేపట్టారు. దావూది అరెస్టు వలన నాయకత్వం లోపించిందన్న భావన కార్యకర్తలలో రాకూడదన్న ఆలోచనతో దావూది చేసిన సూచనను ఆమె పాటించారు. మౌలానా దావూది స్థానాన్ని మరొకరు భర్తీ చేసేవరకు ఎంతో ధైర్యసాహసాలతో భర్త కర్తవ్యాన్ని ఆమె నిర్వర్తించి శభాష్‌ అన్పించుకున్నారు.

సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా సాగిన విదేశీవస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ప్రచారం తదితర కార్యక్రమాలలో ఆమె భాగం పంచుకున్నారు. తొలుత తన ఖరీదైన విదేశీ వస్తువులను తగులబెట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ధరించే విదేశీ వస్త్రాలను ద్వంసం చేసేందుకు తిలక్‌ రోడ్డులో గల

152