పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/151

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


Delhi 1997, page. 260-261.)

అజ్ఞాతం, ఆ తరువాత అరెస్టు, జైలు శిక్షల మూలంగా సుమారు మూడు సంవత్సరాల పాటు భర్త, బిడ్డ లు ఇంటలేరు. ఆమె ఉంటున్న మట్టిల్లు గోడలు కూలిపోయి ఆ కుటుంబంలోని మహిళలకు గోడచాటు కూడ కరువైంది. పర్దానషీ మహిళ లైనందున చాటుకు కనీసం మొండి గోడలు కూడ లేకపోవటంతో చినిగిన చీరలు, గోనెపట్టాలతో కొంత మేరకు చాటు ఏర్పాటు చేసుకుని, కుమార్తెలతో శిథిల గృహంలో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో కూడ ప్రభుత్వం, పోలీసుల వేధింపులకు ఏమాత్రం జంకకుండ, ఉద్యామకార్యక్రమాల పట్ల అపూర్వమైన నిబద్ధత, ధైర్యాన్ని ప్రదర్శించారు. భర్త బిడలు దేశ సేవకు అంకితం కావటం మహత్తర భాగ్యమని భావించిన షఫాతున్నీసా పోలీసుల వేధింపులను, విద్వంసాన్నిఓర్పుతో భరించారు.

1947 నాటికి స్వారాజ్యం సిద్ధించే రాజకీయ వాతావరణం ఏర్పడింది. అఖిల భారత ముస్లిం లీగ్ భారత విభజన కోరటంతో షఫాతున్నీసా దంపతులు సహించలేక పోయారు. మతం ఆధారంగా ప్రజల విభజన తగదన్నారు. పాకిస్తాన్‌ ఏర్పడినంత మాత్రాన ముస్లింలకు వొరిగేది ఏమీ ఉండదని హెచ్చరించారు. ఇస్లాం ప్రమాదాంలో పడిందాని సాగుతున్న ప్రచారాన్నిమøలానా చాలా తీవ్రంగా ఎదాుర్కొన్నారు. ఆ కారణంగా ముస్లిం లీగ్ నేతలకు, కార్యకర్తలకు ఆ దంపతులు శత్రువులయ్యారు. ఆ భయానక వాతావరణాన్ని భరిస్తూ మౌలానా దాంపతులు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. చివరకు విభజన తప్పలేదు. ఆకాంక్షలకు విరుద్దాంగా మాతృభూమి విభజనకు గురికావడం, మొన్నటిదాకా స్వదేశంగా ఉన్న ప్రాంతం ప్రసుతం పరాయి దేశం కావటం లాంటి అవాంఛనీయ వాతావరణం ఆ దాంపతులకు మింగుడు పడలేదు.

1947నాటి విభజన తుఫాను అందరిన్నీ చుట్టుముట్టి అందరి జీవితాల్లో కల్లోలం సృష్టించింది. ఆకల్లోలం తాకిడి షఫాతున్నీసా కుటుంబాన్ని కూడ తీవ్రంగా తాకింది. ఆ మతవిద్వేష పెనుతుఫానులో ఆమె కుటుంబం సర్వం కోల్పోయింది. తల దాచుకునేందుకు మొండిగోడల ఇల్లు కూడ లేకుండ పోయింది. నిలువనీడ లేకున్నా, తిండికరువైనా పర్వాలేదనుకున్నా చివరకు షఫాతున్నీసా కుటుంబీకుల ప్రాణాలకు ఉన్మాదుల నుండి ముప్పు ఏర్పడింది.

ఆ పరిస్థితులలో మిత్రుల, సన్నిహితుల బలవంతం మీద ఆ దంపతులు లూథియానా వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఏనాడు ఊహించనటువంటి దుస్థితి ఎదురు

148