పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/148

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌ పోలీసుల భయంకర దాష్టీకాన్ని ఎదుర్కొన్న

షఫాతున్నీసా బీబీ

(1896-1948)

స్వాతంత్య్రోద్యమంలో అష్టకష్టాలు భరించి, అహర్నిశలు శ్రమించి స్వరాజ్యం లభించాక తాము పుట్టి పెరిగిన గడ్డ ను వదాలి వెళ్ళాల్సి వస్తే అది అత్యంత దుర్భర అనుభవం అవుతుంది. అవిశ్రాంతంగా సాగిన స్వాతంత్య్రోద్య మం పుష్పించి, ఫలించి స్వరాజ్యం సిద్ధించాక మతం ఆసరాతో రాజకీయ నేతృత్వంలో పలు స్వార్థప్రయోజనాలు జమిలిగా ఆడిన వింతనాటకంలో విభజన ముంచుకు వచ్చింది. స్వలాభం ఏమాత్రం ఆశించక ఆనాడు పోరు బాట సాగిన కుటుంబాలు చేసిన అద్వితీయ త్యాగాలు మతం ముద్రావలన మరుగునపడి బలవంతంగా స్వంత గడ్డను విడిచిప్టాెెల్సి రావటం విషాదాకరం. అటువిం భయానక అనుభవాలను విభజన సంఘటన కొన్ని కుటుం బాలలో తెచ్చిపెట్టింది. ఆ భయంకర చేదు అనుభవాలను చవిచూసిన మహిళ షఫాతున్నీసా బీబీ.

1896లో పంజాబ్‌లోని లూధియానాలో షఫాతున్నీసా జన్మించారు. ఆమె తండ్రి మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ నక్షా బంది. ఆయన ధార్మికపండితుడు. ఆయన చిన్న కుమార్తె షపాతున్నీసా బీబీ. చిన్ననాటనే ఆమె ధార్మిక విద్యతోపాటుగా లౌకిక విద్యను అభ్ సించారు.

1457