పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/147

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


సతమతమవుతున్న అంజాది బేగం లండన్‌ ప్రయాణం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.మౌలానా లండన్‌ చేరు కున్నాక రౌండ్‌ టేబుల్‌ సమావేశాల కోసం అవిశ్రాంతంగాశ్రమించిన కారణంగా అంతంత మాత్రం గా ఉన్న ఆయన ఆరోగ్యం మరింత కీణంచింది. చికిత్సకు నిధులు కరువు కాగా,ఆల్వార్‌ మహారాజా పంపిన వైధ్యులు ఆయనకు వైద్యంప్రారంభించారు. ఆయన శరీరం అనుకూలంగా స్పందించలేదు. అత్యధిక సమయంవిశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు నిర్దేశించినా మౌలానా మాత్రం అధ్యయనం,ప్రముఖులతో చర్చలు జరపటం, లేఖలు రాయటం మానకుండా ప్రతిక్షణం స్వరాజ్యంగురించి, హిందూ-ముస్లింల ఐక్యత గురించి, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల గురించిఆలోచనలు సాగించారు. ఆ సమరయోధుని సేవలో అంజాది బేగం ఆవిశ్రాంతంగాగడపారు. ఆ స్థితిలో ఆర్థిక పరిసితులు అనుకూలించక ఆమె ఎంతో క్షోభకు గురయ్యారు. ఆ దుస్థితి, అనుభవిసున్న కటిక పేదరికం గురించి అంజాది బేగం తన కుమార్తె జోహరాకు లేఖలు రాస్తూ ఎంతో వ్యక్తంచేశారు.

ప్రతికూల వాతావరణంలో అంజాది బేగం ఎంతగా శ్రమించినా ఫలితం దక్క లేదు.చివరకు మరణశయ్య నుండి, "...To live for a great cause, and live upto it is perhaps harder than to die for it" అని తన మనోగతాన్ని వ్యక్తంచేస్తూ,1931 జనవరి 4న మౌలానా ముహమ్మద్‌ అలీ అంతిమశ్వాస విడిచారు.

మౌలానా అంత్యక్రియలు పూరయ్యాక అంజాది బేగం స్వదేశానికి తిరిగి వచ్చారు.రాజకీయంగా ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులతో వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా ఆమె కూడ చిన్నచూపుకు గురయ్యారు. ఆ తరువాత కాలంలో ఆమె క్రమంగా అఖిల భారత ముస్లిం లీగ్ కు సన్నిహితులయ్యారు. ఆ వేదిక నుండి కూడ ఆమె పరాయిపాలకుల వ్యతిరేక పోరాటంలో భాగస్వాములయ్యారు.

ఈ విధంగా జీవిత చరమాంకం వరకు బ్రిటిషు వ్యతిరేక పోరులో పాల్గొన్న సాహస మహిళగా అంజాదీ బేగం నిర్వహించిన మహత్తర పాత్ర నిర్లక్ష్యానికి గురై చరిత్ర పుటలలో వెనక్కి నెట్టి వేయబడిన శ్రీమతి అంజాదీ బేగం చివరకు అతిసాదాసీదా జీవితం గడుపుతూ కన్నుమూశారు.

144