పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/136

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

చేస్తే ఆమె ఆరోగ్యం కుదటపడుతుందని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు జులేఖా బేగం కలకత్తా వదలి రాంచీ వెళ్ళారు.ఆరోగ్యం కొంత మెరుగుపడ్డాక 1942 జూలై 31న తిరిగి కలకత్తా వచ్చారు. ఆమె కలకత్తాకు వచ్చి నాలుగు రోజులు గడవక ముందే ఆగస్టు 1942న మౌలానా కలకత్తా నుండి అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు బొంబాయికి బయలుదేరాల్సి వచ్చింది.

మౌలానా బొంబాయికి బయలు దేరుతున్నప్పుడు చివరి సారిగా వీడ్కోలు పలికిన ఆవేదనాభరిత సంఘటనలో జులేఖా బేగం ప్రవర్తన తీరు గురించి India Wins Freedom (page.95) లో ఆజాద్‌ రాస్తూ, ఆగస్టు 3న బొంబాయి బయలేరుతున్నప్పుడు ఎప్పటివలే నన్ను సాగనంపడానికి ఆమె వీధి గుమ్మం వరకు వచ్చింది. అనూహ్యమైన పరిస్థితులేమి ఎదురవ్వకపోతే 13న తిరిగి వస్తానని చెప్పాను.' ఖుదా- హాఫీజ్‌ ' అన్న మాటతప్ప ఇంకొక్క మాట ఆవిడ నోివెంట రాలేదు. ఆమె ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నా, దుఖం ఛాయలు ఆమె ముఖం మీద తారాడుతున్నాయి. ఆమె కళ్ళు వర్షించటం లేదు కాని ఆమె మోము బాధను వ్యకంచేస్తుంది. నేను గతంలో అనేకసార్లు ఆమెను వదలి వెళ్ళాను. నేనప్పుడూ ఆమెను అంత బాధాతప్తంగా చూడలేదు అని వివరించారు. (Understanding The Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, New Delhi, 1987, Page. 240).

ఆ విధంగా బొంబాయి వెళ్ళిన మౌలానా పలు కారణాల మూలంగా భార్యకు వాగ్దానం చేసినట్టు కలకత్తాకు రాలేకపోయారు. బ్రిటిషు ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి నైనిటాల్‌ జైలులో బంధించింది. ఆ సమయంలో జులేఖా బేగం ఆయనకు పలు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలలో ఎక్కడ కూడ తన అనారోగ్యం గురించి పేర్కొనలేదు . ఆమె ప్రాణాంతక రుగ్మతతో తీవ్రంగా బాధాపడుతున్నందున, ఆ పరిస్థితిని మిత్రుల ద్వారా, పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా మాత్రమే మౌలానా తెలుసుకున్నారు. ఆయనను పెరోల్‌ మీద విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలకు తలవంచి భార్యను చూడడానికి మౌలానా నిరాకరించారు. ఈ విషయం మీద జవహర్‌ లాల్‌ నెహ్రూ˙తోపాటుగా ఇతర నాయకులు కూడ ఎంతగా నచ్చచెప్పినా అవమానకర ఆంక్షలను శిరసావహించి పెరోల్‌ మీద విడుదల పొందాడనికి మౌలానా ఆజాద్‌ ససేమిరా అంగీకరించలేదు.

133