పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/131

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అన్సారి బేగం సమక్షాన శ్రద్ధభావనలతో నా శిరస్సు వంచాను (మైనే శ్రద్ధా భావ్‌సే అపనా శిర్‌ బేగం అన్సారి కే సమక్ష్ మే ఝు కా దియా) అని అన్నారు. మహాత్మా గాంధీ తన ఢిల్లీ పర్యటనలో డాక్టర్‌ అన్సారి ఇంట మాత్రమే బసచేసేవారు. ఆ సందర్భంగా బేగం అన్సారితో కుటుంబ విషయాలనే కాకుండ, జాతీయోద్యమ కార్యక్రమాల గురించి కూడ చర్చించేవారని HALDE EDIB రచనల ద్వారా తెలుస్తోంది. ఆ సన్నిహితత్వం నేపద్యంలో మహాత్ముడు ఆ మహనీయురాలి పట్ల అంయత అపూర్వగౌరవాన్ని ప్రకటించారు.

అద్వితీయ త్యాగమూర్తులైన డాక్టర్‌ అన్సారి, బేగం షంషున్నీసా దంపతులకు సంతానం లేదు. జాతీయోద్యామ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నఆ దంపతులు సంతానం గురించి ఆలోచించలేదు. చాలా కాలం తరువాత జోహారా బేగం అను అమ్మాయిని, షౌకతుల్లా అను అబ్బాయిని పెంచుకున్నారు. ఈ ఇరువురు కూడ జోహరా బేగం అన్సారి, షౌకతుల్లా అన్సారి పేర్లతో ప్రసిద్ధులయ్యారు. బిడ్డలు జోహారా బేగం, షౌకతుల్లా అన్సారిలను స్వాతంత్రోద్యామంలో కియ్రాశీలక పాత్ర వహించే విధంగా బేగం అన్సారితీర్చి దిద్దారు.

1936లో డాక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి మరణించారు. భర్త మరణించినా ఆయన లేని లోటు కన్పించకుండ బేగం షంషున్నీసా చివరి శ్వాస వరకు స్వరాజ్య కాంక్షతో భారత జాతీయ కాంగ్రెస్‌కు, జాతీయోద్యమకారులకు తన ఇంట అసమానమైన సేవలందించారు. డాక్టర్‌ అన్సారి సమకూర్చిపెట్టిన సంపదను, తన అమూల్యమైన సమయాన్ని ఆమె పూర్తిగా జాతీయోద్యమానికి అంకితం చేశారు. డాక్టర్‌ అన్సారి ఏమి సాధించినా అదాంతా షంషున్నీసా సహకారంతో మాత్రవుే నని ఆమె ప్రముఖుల గౌరవాన్ని అందుకున్నారు. ఆమెతో పరిచయమున్న ప్రతి ఒక్కరిచే పవిత్రమైన.. దానశీల మహిళగా (Very pious, very charitable) ప్రశంసలందుకున్నారు.

ఈ మేరకు చివరివరకు స్వాతంత్య్రోద్యమానికి తోడ్పాటు అందిస్తూ,జాతీయోద్యమ కార్యకర్తల, ఉద్యమనాయకుల, ప్రజల గౌరవాభిమానాలను అందుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు శ్రీమతి షంషున్నీసా అన్సారి 1938లో కన్నుమూశారు.

128