పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/115

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆమె 1901లో వివాహం చేసుకున్నారు. మౌలానా పూర్తి పేరు ఫజలుల్‌ హాసన్‌ హసరత్‌ మోహాని. వివాహానంతరం భర్తతోపాటుగా అలీఘర్‌ చేరుకున్న బేగం నిశాతున్నీసా చిన్నతనంలోనే ప్రదర్శించిన స్నేవాభావాలకు, స్వేచ్ఛా, స్వతంత్ర భావాలు గల హసరత్‌ మోహాని తోడ్పాటు లభించింది. మంచి చదువరి అయినటువంటి ఆమెకు పండితుడు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాభిలాషి అయినటువంటి భర్త లభించటంతో ఆమె అధ్య యనం మరింత చురుకుగా సాగింది.

వివాహం తరువాత అలీఘర్‌లో విద్యాభ్యాసం చేస్తున్న మౌలానా మోహాని 1903లో ఉరూ-ఏ-మøల్లా (Urdu-e-Mualla) అను ఉర్దూ పత్రికను ప్రారంభించారు. మౌలానా మెహాని, బేగం నిశాతున్నీసా 1904లో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. అప్పటి నుండి ఆ దంపతులిరువురు జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలన్నిటిలో పాల్గొనసాగారు. 1907లో సూరత్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు అతివాదులు- మితవాదులుగా చీలిపోగా అతివాదుల నేత బాలగంగాధర తిలక్‌ వెంట మౌలానా నడిచారు.ఆ తరుణంలో బేగం నిశాతున్నీసా భర్త అభిప్రాయాలను సమర్థించటమే కాకుండ ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతివాద రాజకీయాలను ప్రోత్సహించారు.

1908లో ఉర్దూ-ఏ-మౌల్లా బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించిన ఓ వ్యాసం పట్ల ఆగ్రహించిన ప్రభుత్వం ఇండియన్‌ డిఫెన్స్‌ రూల్స్‌ క్రింద నౌలానాను 1908 న్‌ 22న అరెస్టు చేసింది. మౌలానా అరెస్టు కావటం అది మొదటిసారి. ఆ సమయంలో ఆమె తొలి సంతానం ఏడాది వయస్కురాలైన పసికందు నైమా బేగం (Naima Begum) తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఆ

 కుటుంబంలో అరెస్టులు, జైళ్ళ అనుభవం లేదు. అయినా గ్రామీణ ప్రాంతం నుండి

వచ్చిన బేగం నిశాతున్నీసా భర్త అరెస్టు పట్ల ఏమాత్రం భయపడకుండ ఉద్యామకారిణిగా అత్యంత ధైర్యాన్నిప్రదర్శించారు.

ప్రభుత్వం, పోలీసుల చర్యలకు తాను భయపడకుండటం అటుంచి భర్తకు ఎంతో ధైర్యం చెప్పారు. మౌలానా మోహానిని అరెస్టు చేసిన మరుసటి రోజున ఓ లేఖ రాసి దానిని పోలీసు అధికారి ద్వారా ఆయనకు పంపారు. ఆ లేఖలో మీ మీద విరుచుక పడిన ప్రమాదాన్నిఎదుర్కోండి. నా గురించి ఆలోచించ వద్ధు. మీ నుండి

112