పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్‌ దాష్టికాలకు భయపడని ధీశాలి

బేగం నిశాతున్నీసా బేగం

(1884-1937)

భారత స్వాతంత్య్రోద్యమంలో భర్త రాజకీయాభిప్రాయాలను గౌరవిస్తూ ఆయన అడుగుజాడల్లో ఉద్యమ దిశగా సాగిన భార్యలు కొందారైతే, స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉండి ఉద్యమంలో స్వేచ్ఛగా పాల్గొంటూ, భర్తను కూడ తన నిర్దుష్ట,నిక్కచ్చి అభిప్రాయాలతో ఉద్యమ దిశగా ప్రోత్సహించినవారు కొందరు న్నారు. అటువంటిఅరుదైన ధీరవనితలలో బేగం నిశాతున్నీసా అగ్రగణ్యులు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మోహాన్‌ జిల్లాకు చెందిన అవధ్‌లో నిశాతున్నీసా బేగం 1884లో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సయ్యద్‌ శబీబ్‌ హసన్‌ మోహానీ రాయచూర్‌లో హెకోర్టు న్యాయవాది. చిన్నతనంలో బేగం నిశాతున్నీసా ధార్మిక విద్యతోపాటుగా అరబ్బీ, ఉర్దూ, పర్షియన్‌ భాషలను అభ్యసించారు. ఆ ప్రాంతంలో విద్యావకాశాలు లేని బడుగువర్గాల ఆడపిల్లలకు చదవటం, రాయటం నేర్పటం ప్రారంభించి చిన్న వయస్సులోనే ఆమె తనలోని సేవాభావాన్ని వెల్లడి చేశారు. ఈ మేరకు ఆమె మోహాన్‌ (Mohan) జిల్లా చెందిన ఉన్నవ్ గ్రామంలోని బాలికలలో విద్యాభ్యాసం పట్ల ఆసక్తిని కలిగించారు.

జాతీయోద్యమంలో చిచ్చరపడుగుగా ఖ్యాతిగాంచిన మౌలానా హసరత్‌ మోహానిని


111