పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/112

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లింమహిళలు


డాక్టర్‌ ఆలంకు ఎటువంటి చికిత్స జరగకపోవడంతో సమయం గడిచే కొద్ది ఆయన ఆరోగ్యం ప్రమాదాకర స్థితికి చేరుకుని చివరకు రక్తం కక్కుకుంటూ ఆయన మృత్యువుకు సమీపం కాసాగారు.

ఆ పరిస్థితు లలో డాకర్‌ ఆలం హితైషులు బేగం ఆలం వద్దకు వచ్చి ఆమెకు నచ్చచెప్ప ప్రయత్నించారు. పరిస్థితులు చేయిదాటి పోతున్నందున ఉద్యమకారుడు డాక్టర్‌ ఆలంను కాపాడుకునేందుకు ప్రభుత్వానికి వినతి పత్రం పంపాల్సిందిగా హితవు పలికారు. ఆలస్యం చేస్తే ఆయన విలువైన ప్రాణాలను రక్షించటం ఎవ్వరికీ సాధ్యం కాదని, అందువలన త్వరపడల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్‌ ఆలం ఆరోగ్యంపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు పత్రికలలో ప్రజల విజ్ఞప్తుల పరంపర సాగింది. ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, కార్యకర్తలు డాక్టర్‌ ఆలం అనుచరులు, మిత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితులను తలచుకుంటూ తీవ్రంగా వ్యధ చెందారు.

ఆ సమయంలో బేగం ఆలం నిరుపమాన దేశబక్తినీ ఉద్యమకారుడైన భర్త దాఢనిర్ణయం పట్ల గల గౌరవం, ఆమెలోని అసమాన ధైర్యసాహసాలు బహిర్గతమయ్యాయి. డాక్టర్‌ ఆలం అనారోగ్య పరిస్థితి పట్ల దేశవ్యాపితంగా వ్యక్తమవుతున్నఆందోళన, సన్నిహితుల నుండి వ్యక్తమవుతున్న హితవచనాల నేపధ్యంలో ఆమె ప్రజల నుద్దేశించి చేసిన ప్రకటన సంచలనం సృషించింది. ఆ ప్రకటన జాతీయోద్యామకారులకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలచింది. పర్ధానషీ మహిళలు కూడ మాతృదేశ విముక్తికోసం సాగుతున్న పోరాటం పట్ల కలిగియున్న స్పష్టమైన అవగాహనకు బేగం ఆలం చేసిన ప్రకటన స్పష్టంగా అద్దం పట్టింది.

ఆనాడు బేగం ఆలం చేసిన ప్రకటనను బిజనోర్‌కు చెందిన మదీనా అను ఉర్దూ పత్రిక 1932 అక్టోబర్‌ 25నాటి సంచికలో ప్రచురించింది. ఆ ప్రకటన ఈ విధంగా సాగింది.

మాతృభూమి, స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు, ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా. అందువలన నా భర్త జీవితాన్నిఎలా ఉపయోగించుకోవాలన్నది జాతి జనులు నిర్ణయించాలి...ప్రభుత్వాన్ని అర్థించి, నా భర్త నామీద ఉంచిన విశ్వాసాన్నినేను భంగపరుస్తూ, ఆయన త్యాగపూరిత దృఢ నిశ్ఛయానికి వ్యతిరేకంగా నేను వ్యవహరించలేను...జరిగేదేదో జరగనివ్వండి.

109