పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

బానిస బతుకు కంటే గౌరవప్రదమైన మరణం మేలని చాటిన

బేగం ముహమ్మద్‌ ఆలం

భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న భర్తల అడుగుజాడల్లో నడుసూ,తమదైన ప్రత్యేక పాత్రను నిర్వహించిన ముస్లిం మహిళలు ఎందారో ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రస్తావనలు చాలా అరుదుగా కన్పిస్తాయి. జీవిత భాగస్వాములు బ్రిటిష్‌ ప్రబుత్వం దాష్టీకాలకు గురవుతూ, తరచుగా జైలు పాలవుతున్నందున ఎదురవుతున్న ఆర్థిక సామాజిక ఇక్కట్లతోపాటుగా మనోవ్యధను జీవితమంతా భరిస్తూ ఉద్యమాలకు ఊపిరి పోసిన మహిళామణుల త్యాగం అనిర్వచనీయం. అటువంటి మహిళలు చూపిన తెగువ, చాటిన దేశభక్తి, త్యాగనిరతి, చరిత్రలో తమదైన స్థానం ఏర్పర్చుకున్నాయి. ఆ విధమైన చరిత్రను సృష్టించిని కోవకు చెందిన మహిళలలో బేగం ముహమ్మద్‌ ఆలం ఒకరు.

ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ ముహమ్మద్‌ ఆలం భార్య. లాహోర్‌కు చెందిన ఖాన్‌ షేక్‌ మియా ఫిరోజుద్దీన్‌ కుమార్తె. అసలు పేరు కంటే బేగం ముహమ్మద్‌ ఆలం పేరుతో ఆమె ఎంతో ప్రఖ్యాతి చెందారు. డాక్టర్‌ ఆలం లండన్‌లో ఉన్నత విద్యను పూర్తిచేసుకుని లాహోర్‌ వచ్చి న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1921లో కనకవర్షం కురిపిస్తున్న న్యాయవాద వృత్తిని త్యజించి ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఆనాటినుండి బేగం ఆలం భర్త

107