పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు 23 వహించిన సంఘటనలున్నయి. సన్యాసుల దాళానికి స్వయంగా మజ్నూ షా నాయకత్వం వహించిన సందర్భాలున్నాయి. కంపెనీ బలగాలపై జరిగిన అనేక భారీ దాడులలో ఫకీర్లు,సన్యాసులు కలిసి పాల్గొన్నారని, అధికారుల నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను సవాల్‌ చేస్తూ సాగిన తిరుగుబాటులలో కంపెనీ సాయుధ దాళాల ఉన్నతాధికారులు జనరల్‌ మెకంజీ, లెఫ్టినెంట్ టైలర్‌, లెఫ్టినెంట్ బ్రివాన్స్‌,కమాండర్‌ కెనిత్‌, కెప్టన్‌ రాటన్‌, మేజర్‌ బుచ్చన్‌, రాబర్ట్‌సన్‌ తదితరులను, పలువురు ప్రాంతీయ కలక్టర్లను మజ్నూ షా పరాజితులను చేసారు. 1769లో జరిగిన పోరాటంలో కమాండర్‌ కెనిత్‌ హతమయ్యాడు. కంపెనీ సాయుధ దాళాలు పలాయనం చిత్తగించటం సర్వసాధారణమైంది. చివరకు కంపెనీ పాలకులే తమ బలగాలను పారిపోయి ప్రాణాలు దక్కించుకోమని కోరిన విచిత్ర సంఘటనలూ ఉన్నాయి. కంపెనీ రెవిన్యూ వసూళ్ళకు భారీ నష్టం కలిగించటమేకాక, సాయుధ బలగాలకు తీరని ప్రాణనష్టం కలిగించిన మజ్నూ షాను బంధించడానికి ఎంతగా ప్రయత్నించినా కంపెనీ పాలకులు విజయం సాధించలేకపోయారు. ప్రజలకు ఎన్ని ఆశలు చూపినా,హింసలు పెట్టినా, జమీందారులు ఎంతగా ప్రయత్నాలు చేసినా ఒక కట్టడితో సాగిన ఫకీర్లను గాని, వారికి కవచంలా నిలబడిన గ్రామీణ ప్రజలను గాని చీల్చటం కంపెనీ పాలకులకు సాధ్యం కాలేదు. ఆయుధబలం, అంగబలం కలిగిన ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఆనాడు ఫకీర్లు-సన్యాసులు పెను సవాలుగా మారి ముప్పతిప్పలు ట్టి చరిత్ర సృష్టించటం అపూర్వమైన విషయం. ప్రజల ప్రధాన భాగస్వామ్యంతో పటిష్టమైన నిర్మాణ ఎత్తుగడలను అవలంబించడం వలన ఫకీర్లు కంపెనీ పాలకులను సవాల్‌ చేయగలిగారని బ్రిీటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్ కూడ అంగీకరించాడు.

విస్తరించిన పోరాటం ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, పాలకుల తాబేదార్లు, మహాజనుల దుష్కృత్యాలు,మజ్నూ షా లాింటి సమర్థులైన నేతల సారధ్యంలో సాగుతున్నరాజీలేని పోరాటం, ఫకీర్ల-సన్యాసుల ఐకమత్యం ఫలితంగా బెంగాల్‌, బీహార్‌, అస్సాం, ప్రస్తుత భూాటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర ప్రాంతాలకు వ్యాపించింది. ప్రధానంగా మేమ్‌ సింగ్; ధక్కా, రంగాపూర్‌, బొగ్రా, రాజాషాహి, బీనాజ్‌ పూర్‌, మాల్దా, కోచ్‌ బీహార్‌, ముషీరాబాద్‌.బరద్వాన్‌, బీరంపూర్‌ లాింటి ప్రధాన జిల్లాల్లో ఫకీర్లు సమాంతర ప్రభుత్వాలను నడిపారు.ఈ ప్రాంతాలలో నూతన జమీందార్ల స్థానంలో ఫకీర్లు ప్రజల నుండి స్వచ్ఛందాంగా విరాళాలు సేకరించారు. కంపెనీ సాయుధబలగాల నుండి, వడ్డీ వ్యాపారుల నుండి, కంపెనీ అధికారుల నుండి ప్రజలకు రక్షణ కల్పించారు. ఫకీర్లకు లభిస్తున్న ఆదరణ, పెరుగుతున్న ప్రజాబలం, కంపెనీ అధికారుల పరాజయాల పరంపర వలన కంపెనీచే నియమితులైన జమీందారులు,బ్రతికి ఉంటే బలుసాకు తిని బ్రతకవచ్చని, జమీందారీలను వదులుకుని వలస వెళ్ళాల్సిన పరిస్థితులను ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం కల్పించింది.