పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 18 సమకూర్చుకుంటున్నారన్ననెపంతో కంపెనీ బలగాలు దాడి జరిపి, ఉత్సవంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 150మంది ఫకీర్లు మరణించారు. ఈ సంఘటన రగిల్చిన ఆగ్రహజ్వాలల నుండి పుట్టుకొచ్చారు, ఫకీర్ల మహాసేనాని మజ్నూషా ఫకీర్‌. అప్పికే బ్రిీషర్ల చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నఫకీర్లు ప్రతీకారేచ్ఛతో మహాసంగ్రామానికి ఆయుధాలు చేత పట్టారు. ప్రజలను, పూర్వపు జమీందారులను కూడగట్టటం ఆరంభించారు. స్వదేశీ పాలకులకు లేఖలు రాసారు. మతంతో, మత దృక్పధంతో ప్రమేయం లేకుండ స్వదేశీ పాలకుల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. '...గత సంవత్సరం నిష్కారణంగా 150 ఫకీర్లను బలి తీసుకున్నారు...',... అంటూ ఆ నాటిభయానక సంఘటనను భవాని మహారాణికి వివరిస్తూ, 1772 లో రాసిన లేఖలో మజ్నూషా ఆమె సహాయ సహకారాలు కోరారు. సన్యాసులు-ఫకీర్ల పోరాటం 1761లో ఆవిర్భవించినప్పిటికీ, ఆ నాటి గ్రామీణ ప్రజల రైతుల ఇతర వర్గాల ప్రజల జీవన స్ధితిగతులను పాలకులు విషమయం చేసిన తీరు, భయంకర క్షామంలో కూడ అధికారులు కర్కశంగా వ్యవహరించిన తీరుతెన్నులు, ఫకీర్లను బలి తీసుకున్న కిరాతక సంఘటనలు అటు ఫకీర్లను, ఇటు సన్యాసులను, పలు వర్గాల ప్రజలను, పూర్వపు జమీందారులను ఏకం చేసాయి. మాతృదేశం నుండి ఫిరంగీలను తరిమివేయటం ద్వారా మాత్రమే తమ ఇక్కట్లు తొలగుతాయని, సమస్యలు పరిష్కారం కాగలవని ప్రజలు భావించారు.

జమీరుద్దీన్‌ దాఫేదార్‌ రచన ఫకీర్ల నేత మజ్నూ షాను పోరాట దిశగా నడిపించిన వాతావరణాన్ని బీర్‌భూం (BIRBHUM) కు చెందిన ప్రముఖ బెంగాలీ కవి జమీరుద్దీన్‌ దపేదార్‌ (JAMIRUDDIN DEFEDAR), 1887 సంవత్సరంలో రాసిన Manju Shaher Hakikat అను పద్యకావ్యంలో వివరించారు. ఈ పద్యాకావ్యం ప్రకారం, ఒకసారి మజ్నూ షా ఫకీర్‌ తన గురువు దర్వేష్‌ హమీద్‌ వద్దకు వెళ్ళగా, ఆనాటి భయంకర పరిస్థితులను దర్వేష్‌ ఈ విధంగా వివరించారు. '....లక్షలాది ప్రజానీకం కరువు వలన మరణిస్తున్నారు. వాళ్ళ జీవితాలను కాపాడు. కంపెనీ ఏజంట్లు, అధికార్లు అధిక రెవిన్యూ కోసం రైతులను, చేతివృత్తులవారిని, ప్రజలను హింసిస్తున్నారు. ప్రజలు గ్రామాలు వదలి వెళ్ళిపోతున్నారు...' ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజల స్థితిగతులను స్వయంగా తెలుసుకునేందుకు గురువు ఆదేశాల మేరకు మజ్నూషా పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజల కష్తసుఖాలను ఇక్కట్లను గమనించారు. ఫిరంగీలు, ఫిరంగీల తాబేదారులైన జమీందారుల క్రూరత్వం వడ్డీ వ్యాపారుల దోపిడీ చక్రబంధంలో విలవిలలాడుతున్న అభాగ్యులను, ఆదుకునే నాధుడు లేక అల్లాడుతున్నప్రజలను చూసారు. ఈ పర్యటనలో నజ్నూషా మాతృదేశాన్నిఫిరంగీల నుండి విముక్తం చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించి ప్రకటించారు. కంపెనీ పాలకుల చర్వలను సహించలేని ప్రజ లు ఆయనవెంట నడి చేందుకు సిసద్దమయ్యారు. ఈ శిష్యబృందంతో కలసి నమజ్నూషా గురువు వద్దకు వచ్చారు. ప్రజల దుర్భర పరిస్థితులను