పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/31

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌


దుష్పరిణామాల ఫలితం ఈనాటికీ కూడ భారతీయ ముస్లింల వెనుకబాటు తనంలో ప్రతిఫలిస్తుంది. ఆనాడు హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్య నెలన్న బలమైన ఐక్యతను చూసి పాలకులు కలవరం చెందారు. ఈ రెండు సాంఫిుక జన సముదాయాలను చీల్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. చరిత్రను వక్రీకరించారు. ముస్లిం పాలకులకంటే తమ పాలన మెరుగైనదన్న అభిప్రాయం భారతీయులలో కలుగు చేసేందుకు ఆంగ్లేయ చరిత్రకారులు గ్రంథరచన సాగించారు. ముస్లిం పాలకులు పరమత విద్వేషులుగా, రాక్షసులుగా చిత్రీకరిస్తూ చరిత్ర రచన గావించారు. ఆ విధగా వక్రీకరణ,చిత్రీకరణలకు గురైన చరిత్ర ఆధారంగా ఆ తరువాత కాలంలో భారత చరిత్ర రచనసాగటం వలన సహజంగానే స్వదేశీ చరిత్రకారులు ఆ ప్రభావానికిలోనై, ముస్లింల బ్రిటిష్‌ వ్యతిరేక వీరోచిత గాధలను విస్మరించారు.

భారత జాతీయకాంగ్రెస్‌లో బృహత్తరపాత్ర

ప్రథమ స్వాతంత్య్ర సమరం తరువాత సుమారు మూడు దశాబ్దాల కాలం ముగియకముందే1885లో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్‌ జాతీయోద్యమనాయకత్వాన్నిస్వీరించింది. ఆనాటికి తొలిదశ నుండి మలిదశ వరకు భారతీయ ముస్లింలు

28