పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

సూచనలు ద్వారా సహరిస్తున్నచరిత్రోపన్యాసకులు షేక్‌ మహబూబ్‌ బాషా (బి.ఆర్‌.అంబేద్కర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, లక్నో, ఉత్తరప్రదేశ్‌), ఈ గ్రన్ని పూర్తిగా చదివి పలు సూచనలు చేసిన సమర్శకులు కొత్తపల్లి రవిబాబు (విశాంత ప్రధానాచార్యులు, శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక ప్రభుత్వడిగ్రీ కళాశాల, నగరం, ప్రజాసాహితి మాసపత్రిక ప్రధాన సంపాదకులు), ప్రముఖ రచయిత, సన్మిత్రులు పెద్ది సాంబశివరావు (గుంటూరు) గార్లకు నా ధన్యవాదాలు.

నా ప్రయత్నాలకు తొలినుండి ఎంతగానో సహకరిస్తున్న 'ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌' ఛైర్మన్‌ జనాబ్‌ షేక్‌ పీర్‌ అహమ్మద్‌ (హైదారాబాద్‌), ఉపయుక్తమగు పలు ఉర్దూ గ్రంథాలను చదివి అందులో అవసరమైన సమాచారాన్ని నాకు విడమర్చి చెబుతూ, అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తూ, ప్రతిక్షణం నావెంట నిలచి నన్ను ప్రోత్సహించిన మా అమ్మ సయ్యద్‌ బీబిజాన్‌, నా ప్రతి ప్రయత్నం వెనుక తానుండి సతతం నాకు చేదోడుగా నిలుస్తూ, అన్నివిధాల ప్రోత్సహిస్తూ, క్రియాశీలక చోదకశక్తిగా సహకరిస్తున్న నా జీవిత భాగస్వామి షేక్‌ రమిజా భాను, మా కుటుంబ గ్రంథాలయం పర్యవేక్షకురాలిగా, ఏ సమయంలోనైనా ఏ గ్రంథం కోరినా శ్రమ అనుకోకుండా తక్షణమే అందిస్తూ వచ్చి, నా రచనా వ్యాసంగం సాఫీగా సాగడానికి పూర్తిస్థాయిలో సహకరించిన నా కుమార్తె సయ్యద్‌ జాశ్మిన్‌ అహమ్మద్‌ల సహకారం లేనట్లయితే ఈ గ్రంథాన్ని సజావుగా పూర్తిచేయడం నాకు సాధ్యమయ్యేది కాదు.

ఈ గ్రంథ రచయితను నేనైనా, సమాచార సేకరణ వద్ద నుండి, ఆ సమాచారానికి పుస్తకం రూపం కల్పించి పాఠకులకు అందించగలిగించేంత వరకు సాగిన సుదీర్గ… ప్రక్రియలో నాకు ప్రత్యక్షంగా సహకరించిన పలువురు ప్రముఖులు, సన్నిహితులు, మిత్రులతోపాటుగా పరోక్షంగా నాకు చేయూత నిచ్చిన రచయితలు, ప్రచురణకర్తలు చాలా మంది ఉన్నారు. ఆ కారణంగా ఈ గ్రంథం సృష్టి వ్యష్టి కృషి కంటే సమష్టి కృషి ఫలితమని సవినయంగా విన్నవించుకుంటూ, నేను సంప్రదించిన పలు గ్రంథాల రచయితలకు, ఆ గ్రంథాల ప్రచురణ కర్తలకు, నేను సందర్శించిన పలు గ్రంథాలయాలకు చెందిన అధికారులకు, ఆ గ్రంథాలయాల సిబ్బందికి, ఈ గ్రంథ రచన-ప్రచురణ కార్యక్రమంలో సహకరించిన ప్రతిఒక్కరికీ నా హృదాయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇక ... ఈ గ్రంథం గురించి తీర్పు చెప్పాల్సింది పాఠకులే !