పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/69

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

69


వ.

అది యెట్లనిన.

283


సీ.

నానామనశ్శ్రోత్రనయనయుగ్మముచేత
        నెఱి గృహ్యమానమై నిలుచు నెయ్య
దా పదార్థం బనిత్యంబుగా నెఱుఁగుఁడు
        బ్రహ్మంబు జగ మని రమణఁ దెలియుఁ
డా బ్రహ్మ మఖిలభూతాంతర్నివాసియై
        వర్తించు సాక్షియై వానియందు
దేహి కర్మార్జితదేహంబు ధరియించి
        శాంతుఁడై సంసారచింత మాని


గీ.

మమత వర్జించి తుర్యాశ్రమస్థుఁ డగుచు
నిర్మలజ్ఞాననియతుఁడై నెమ్మితోడ
యోగమార్గాధిరూఢుడై యుండెనేని
మత్పదంబున [1]వసియించు మాన్యుఁ డగును.

284


వ.

మరియు దేహి స్వప్నగతుండై పదార్థదర్శనంబు సేసినట్లు జాగ్ర
దవస్థం దోఁచిన యవి నిత్యంబులు గావు. యోగి లోకమందు
మదిరాపానంబుఁ జేసి మదాంధుఁ డైనవాఁడు పరిధానాంశుక
పాతనాపాతనంబుల నెఱుంగని చందంబున దైవకృత్యంబు లైన నిజ
దేహ స్థితి నాశనంబుల నెఱుంగఁడు. కర్మానుభవసమాప్తిపర్యం
తంబు దేహంబు వర్తించు నని సనకాదులకు సాంఖ్యయోగం
బుపదేశించి వారిచేఁ బూజితుండనై పరమనిలయంబున కరిగితి
నంత నీ యోగంబును విధాత యెఱింగి భృగ్వాదులకును, బ్రహ్మ
ఋషులకును జెప్పె. వారు దేవ దానవ గంధర్వుల కుపదేశించిరి.
తన్మూలమున మర్త్యలోకవాసు లభ్యసించిరి. ఇవ్విధంబునఁ

  1. వరించు. వ్రాఁతప్రతి