పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ఏకాదశస్కంధము


వ.

అని పలికిన సత్యభామావల్లభుఁ డిట్లనియె.

278


క.

సనకాదుల కే రూపం
బునఁ జెప్పితి వఖిలయోగమును దద్రూపం
బనఘ రమాధిప నాకును
వినుపవలయు మనములోన వేడ్కఁ దలిర్పన్.

278


చ.

అని ముని పల్కి నంత విబుధాహితఖండనుఁ డానతిచ్చె ని
ట్లనఘ మునీంద్రవర్య సనకాదులు పూర్వవిధాతమానసం
బున జనియించి తత్త్వము సమున్నతితో నెఱుగంగఁ బూని, వా
రనుమతి బ్రహ్మఁ జే రడిగి రందఱుఁ నొక్కెడఁ బ్రశ్నబీజమున్.

279


ఆ.

కోరి చిత్తమందు గుణములు వర్తించుఁ
దద్గుణంబులందుఁ దనరుఁ జిత్త
మాయురంబులోన నన్యోన్యసంత్యాగ
మెట్లు సేయవచ్చు హేమగర్భ.

280


సీ.

సనకాదు లీ విధంబునఁ బశ్నఁ జేసిన
        బ్రహ్మజ్ఞుఁ డైన యా పద్మభవుఁడు
పరువడిఁ దత్కృతప్రశ్నబీజము గాన
        లేకుంట యెఱిఁగి నే లోకభర్త
కీ ప్రశ్నబీజంబు నెఱుఁగ జెప్పగఁ బూని
        హంసరూపముఁ దాల్చి యచట కరుగ
నా మునీంద్రులు నాకు నర్ఘ్యపాద్యము లిచ్చి
        పాదాభివందనం బరగఁ చేసి


గీ.

బ్రహ్మ మొదలైన సనకాది బ్రహ్మమునులు
తత్త్వజిజ్ఞాసు లై నన్ను [1]దగ్గ ఱడిగి
నంత వారల కేఁ జెప్పినట్టి యోగ
మంతయును నీకు నెఱిఁగింతు నాదినుండి.

231
  1. దగ్గఱి+అడిగినంత. క్త్వార్థకసంధి