పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ఏకాదశస్కంధము


క.

చీమలు పెట్టిన పుట్టలఁ
బాములు సుఖియించునట్లు పరమజ్ఞానుల్
ప్రేమంబునఁ బరగృహమున
వేమఱు సుఖియింతు రధికవిభవముతోడన్.

238


చ.

అరయఁగఁ నూర్ణనాభిహృదయమ్మునఁ దంతువికాన మొప్పఁగా
బరువడితో రచించి యది భగ్నము సేసి గ్రహించునట్లు, వే
మరు హరి భూతపంచకసమన్వితపృష్టి, సృజించి దాని సం
హరణము సేయు నంత్యమున నక్షయరోషకషాయితాక్షుఁడై.

239


ఆ.

నరుఁడు కూర్మినైన నతిరోషముననైనఁ
జిత్త [1]మేమిటందుఁ జేర్చునేని
నతఁడు తత్స్వరూప మగుచుండు షట్పదా
క్రాంతమైన కీటకంబుకరణి.

240


వ.

ఇవ్విధంబున నేను భూమివలన క్షమయును, వాయువువలనఁ బరోప
కారంబును, ఆకాశంబువలనఁ గాలసృష్టగుణాసంగమంబును, జలం
బువలన నిత్యశుచిత్వంబును, అనలంబువలన నిర్మలత్వంబును, నిశాక
రునివలన నధికాల్పసమత్వంబును, సూర్యునివలన జీవనగ్రహణ
మోక్షణంబులును, కపోతంబువలనఁ బుత్రదారాదిస్నేహవిసర్జనం
బును, నజగరంబువలన స్వేచ్ఛాసమాగతాహారభోజనంబును,
సముద్రంబువలన నుత్సాహశోషణపరిత్యాగంబును, శలభంబు
వలన శక్త్యనుకూలకర్మాచరణంబును, షట్పదంబువలన సార
గ్రహణసామర్థ్యంబును, గజంబువలన కాంతావైముఖ్యంబును,
ౙుంటీఁగవలన సంగ్రహణార్జవంబును, హరిణంబువలన నిశ్చలచిత్త
ప్రచారంబును, మీనంబువలన జిహ్వాజయంబును, పింగళ వలన
యథాలాభసంతుష్టియును, గురరంబువలన మోహత్యాగంబును

  1. ఏమిటందు = ఈశబ్దము ‘దేనియందైనను’ అను అర్ధమునఁ బ్రయుక్తము. మూలములలో,
    'యత్ర యత్ర మనో దేహీ ధారయేత్ సకలం ధియా స్నేహాద్ద్వేషా ద్భయాద్వాపియాతి తత్తత్స్వరూపతాం?