పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము-హరిభట్టారకుఁడు


క.

మాయగల వారి నొయ్యన
మాయలఁ బొందించునట్టి మరుజనకుఁడు యా
మాయను వినుపింపుడు మీ
రాయతవాక్ప్రౌఢి మెఱసి హర్షం బొదవన్.

68


గీ.

జనుఁడు సంసారతాపనిస్తప్తుఁ డగుచు
న్మహారోగమున కౌషధం బనఁగ
దనరు భవదీయవాచామృతంబుఁ గ్రోలిఁ
దృప్తిఁ బొందగ కథ లానతిండు మీరు.

69


వ.

అనిన విని యంతరిక్షుం డిట్లనియె.

70


సీ.

భవ్యనిర్గుణపరబ్రహ్మంబు నందును
        దనకు విపర్యయజనకమైన
జ్ఞానంబు దోఁచును సర్వేశుఁ డేమాయ
        చేతను జగము విఖ్యాతముగను
నిర్మించి యటమీఁద నిశ్చిత్తుడై యుండి
        విహరించు నదియ శ్రీవిష్ణుమాయ
ఇంద్రియార్థభ్రమం బిదియ జాగ్రదవస్థ
        మానసభ్రమము దుర్మదుర కెపుడు
స్వప్నజావస్థ మరియుఁ దద్వాసనలకు
సూచకంబగు బీజంబు సుప్త్యవస్థ
సరుసఁ బరమేశు జోడ నన్వయము సేయు
నదియ పరికింప నాల్గవదగు నవస్థ.

71