పుట:భరతరసప్రకరణము.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములవిక్రియ, స్ఫోటము (భేదనము) పండ్లుకొఱుకుట, చేతులు విసరుట, చొల్లకారుట, నురుగు గలుగుట మొదలైనవి గలుగును.

సుప్తిలక్షణం

ఉద్రేక ఏవ నిద్రాయాస్సుప్తిస్స్యాత్తత్ర విక్రియాః,
ఇంద్రియోపరతిర్నేత్రమాలనం స్రస్తగాత్రతా.

203


ఉత్స్వప్నాయతనైశ్చల్యశ్వాసోచ్ఛ్వాసాదయో౽పి చ,

నిదురయొక్క ఆధిక్యమే సుప్తి యనఁబడును. ఇంద్రియములు ఉపరతిని బొందియుండుట, కన్నులు మూసియుండుట, గాత్రము స్రస్తమైయుండుట, కలగనుట, దీర్ఘకాలము కదలకయుండుట, ఉచ్ఛ్వాసనిశ్వాసములు మొదలైనవి గలుగును.

విబోధలక్షణం

విబోధశ్చేతనావాప్తిశ్చేష్టాస్తత్రాక్షిమర్దనం.

204


శయ్యాయా మోక్షణం బాహువిక్షేపో౽౦గుళిమోటనం,
శిరఃకండూయనం చాంగవలనం చైవమాదయః.

205

నిదుర మేలుకొనుట విబోధ మనఁబడును. ఇందు కన్నులు నలుపుకొనుట, పడకను విడుచుట, బాహువిక్షేపము, అంగుళిమోటనము, (బొటనవ్రేళ్లు లాగికొనుట), తలను గోకుకొనుట, దేహమును ద్రిప్పుట మొదలైనవి గలుగును.

అమర్షలక్షణం

అధిక్షేపావమానాద్యైః క్రోధో౽మర్ష ఇతీరితః,
తత్ర స్వేదశ్శిరఃకంప ఆధోముఖ్యవిచింతనే.

206


ఉపాయాన్వేషణోత్సాహవ్యవసాయాదయః క్రియాః,

తక్కువ చేయుట, అవమానము చేయుట మొదలయినవానిచేతఁ గలుగు క్రోధము అమర్ష మనఁబడును. అందు స్వేదము, శిరఃకంపము, తలవంచుకొనుట,