పుట:భరతరసప్రకరణము.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శరీర గౌరవాద్యాశ్చ అనుభావా ఇహ స్మృతాః,

ఆస మొదలైనవానిచేఁ గలుగుజాగును తాళలేకయుండుట ఔత్సుక్య మనఁబడును. ఇందు వేగముగ నడచుట, పడకలోనుండి లేచుట, చింతించుట, శరీరము బరువగుట మొదలైనవి గలుగును.

నిద్రాలక్షణం

మందస్వభావవ్యాయామనిశ్చింతత్వసమాధిభిః.

198


మనోనిమీలనం నిద్రా చేష్టా స్తత్రాస్యగౌరవం,
ఆఘూర్ణమాననేత్రత్వమంగానాం పరివర్తనం.

199


నిశ్వాసోచ్ఛ్వసితే గాత్రస్వేదో నేత్రనిమీలనం,
శరీరస్య తు సంకోచో జాడ్యం చేత్యేవమాదయః.

200

మందస్వభావము, వ్యాయామము, నిశ్చింతత, సమాధి, వీనిచేఁ గలుగు మనోనిమీలనము నిద్ర యనఁబడును. ఇందు ముఖగౌరవము, కన్నులు జొలాయించుట, అంగములపరివర్తనము, ఉచ్ఛ్వాసనిశ్వాసములు, దేహమందు చెమటపోయుట, నేత్రములు మూతపడుట, దేహసంకోచము, తెలివిలేకయుండుట ఇవి గలుగును.

అపస్మారలక్షణం

ధాతువైషమ్యదోషేణ భూతావేశాదినా కృతః,
చిత్తక్షోభస్త్వపస్మారః తత్ర చేష్టాః ప్రకంపనం.

201


ధావనం పతనం స్తంభో భ్రమణం నేత్రవిక్రియా,
స్ఫోటదంశభుజాక్షేపలాలాఫేనాదయో౽పి చ.

202

వాతపితశ్లేష్మధాతువుల హెచ్చుతక్కువ, దోషము, దయ్యము సోకుట మొదలైనవానిచేతఁ జేయఁబడిన మనస్సుయొక్క క్షోభము అపస్మార మనఁబడును. ఇందు వణకుట, పరుగెత్తుట, పడుట, కదలకుండుట, తిరుగుట, నేత్ర