పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/737

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

722

భక్తిరసశతకసంపుటము


చరణాబ్దంబులచెంత నుంచితిని దాస్యక్షోభవిచ్ఛేదనం
బు రహిం గూర్చవె పాఠకాళికి స్వయంభూ సర్వ...

113


మ.

పదిరెండేడులక్రింద నీకృతి సమాప్తం బయ్యె; సిద్దాన డె
బ్బదిపద్యంబులు పత్రికాంతరమునన్ బ్రవ్యక్తమై రాజిలెన్
దుదిపద్యంబులు కొన్ని మిత్రుఁ డొకఁ డెందో పాఱవేయంగ న
ల్వదిపద్యంబుల వ్రాసితిన్ మరల దేవా సర్వ...

114


శా.

మారీస్ఫోటకరోగదూర మగుచున్ మాతృక్షమాభాగముల్
పేరుం బెంపును గాంచుఁగాఁత కవితాబింబోష్ఠి లీలాగతుల్
శ్రీరమ్యంబుగ రాట్సభాంతరములన్ జెన్నొందుతన్ సత్కవి
స్వైరవ్యాప్తికి హేతుభూత మగు ఠేవన్ సర్వలోకేశ్వరా.

115

చెన్నపురి : 'వావిళ్ల ’ ప్రెస్సున ముద్రితము.