పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/708

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పీఠిక

రసికులారా!

ఈశతకమును పదునేనుసంవత్సరముల క్రిందట నారంభించి కొలఁదిదినములకు ఎనుబది పద్యముల వఱకుఁ బూర్తిచేసితిమి. పిదప నాలుగేండ్లకు మిగిలినపద్యములు పూర్తి చేసితిమి. అనంతపురములో నున్న ఎ. పి. కవిగారు తమబాలభారతిలోఁ బ్రచురించుకొనుట కీశతకమును దీసికొని యేబదిపద్యములు దాదాపుగఁ బత్రికలోఁ బ్రచురించి పిమ్మట పత్రిక నాపివేసిరి. ఎన్నిమాఱులు కోరినను మిగిలినపద్యములను బంపరైరి. ముద్రితమైన యేబది పద్యములు మాత్రము పత్రికనుండి తీసి జాగ్రత్త చేసితిమి. ప్రత్యంతరము లేకపోవుటచే మిగిలినపద్యములు క్రొత్తగాఁ బూర్తి చేయవలసివచ్చినది. పనిలోఁబనిగఁ బూర్వపద్యములు చాలవఱకు మార్చితిమి.

మొత్తముమీఁద నీశతకమున నీతివిషయికపద్వము లెక్కువగను భక్తివిషయికపద్యములు కొలఁదిగ నున్నవి. ఇందలిభావములు చాలవఱకు