పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

4

తులు దీసికొని తిరుగ నొసంగక యెన్నిపర్యాయము లడిగినను ఇదిగొ అదిగొ యని మా కీయకపోవుటచే సంకల్పించిన శతకసంపుటప్రచురణమునకు శ్రీవిజయనగర మహారాజావారి తోడ్పాటుపొందుటకు అంతరాయము కలిగినది. వ్యయప్రయాసములకు లోనై వ్రాయించినప్రతులు గైకొని పని ముగిసినను తిరుగ నొసంగకపోవుటయేగాక వంగూరు సుబ్బారావుగారు కీర్తిశేషులగుటకుఁ గూడ విచారించి మరల మొదలెత్తి చిరకాలముక్రిందట సంకల్పించిన శతకసంపుటప్రకటన మిప్పటికి సాగించితిమి. క్రమముగ వేఱువేఱుసంపుటములుగ భక్తి, శృంగార, నీతి, మతవిషయశతకములతో నింకఁ గొన్ని సంపుటములను బ్రచురింపనున్న మాయుద్యమమున కాంధ్రమహాజనులతోడ్పాటవసరము.

ఈ భక్తిశతక తృతీయ సంపుటమునందుఁ గూడ నిరువదిశతకములఁ జేర్చితిమిగాని ఇందలి భద్రగిరిశతకమును శ్రీరమణీమనోహరశతకమును శ్రీపీఠికాపురము మహారాజావారు దయతోఁ బ్రత్యంతరము వ్రాసికొనుటకు మాతృక లొసంగిరి. యాదగిరీంద్ర, నృకేసరీ, శ్రీకృష్ణ లోనగు సముద్రితశతకములను శ్రీ శేషాద్రిరమణకవు లొసంగిరిగాన వారియెడఁ గృతజ్ఞులము. శతకములఁ బ్రత్యంతర