పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ల్పించు సత్పుత్రునిన్‌
బొడమన్‌ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతిం గన్న పదారవిందముల నే భావింతు నారాయణా! 100

మ. తపముల్‌ మంత్రసమస్తయజ్ఞఫలముల్‌ దానక్రియారంభముల్‌
జపముల్‌ పుణ్యసుతీర్థసేవఫలముల్‌ సద్వేదవిజ్ఞానమున్‌
ఉపవాసవ్రతశీలకర్మఫలముల్‌ ఒప్పార నిన్నాత్మలో
నుపమింపం గలవారికే గలుగు వేయు న్నేల నారాయణా! 101

శా. శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడున్‌
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తండ్రీ నన్ను నారాయణా! 102

మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్యసంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబునన్‌
అలర న్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచు దేహంబు దా
వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా! 103

మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్‌ భవద్దివ్యరూ
పము నామామృతమున్‌ దలంప దశకప్రా ప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మో