పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్‌
భవదంఘ్రిస్మరణంబునం గలుగు పో పద్మాక్ష నారాయణా! 87

మ. ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహముం జేసినన్‌
పరగం జెల్లుట సూచి తీ భువనసంపాద్యుండ వైనట్టి మీ
వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్‌ జేసితిన్‌
కరుణం జేకొని కావు మయ్య త్రిజగత్కల్యాణ నారాయణా! 88

మ. గణుతింపన్‌ బహుధర్మశాస్త్రనిగమౌఘం బెప్పుడు న్ని న్నకా
రణబంధుం డని చెప్ప నత్తెఱఁగు దూరం బందకుండంగ నే
బ్రణతుల్‌ జేసెదఁ గొంత యైనఁ గణుతింపం బాడి లేకుండినన్‌
ఋణమా నానుతి నీవు శ్రీపతివి నీ కే లప్పు? నారాయణా! 89

మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెసన్‌ ఖండించి మించెం దయా
పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా! 90

శా. ఏభావంబున నిన్‌ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యేభావంబున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావంబున నీశరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే
నాభావంబున నీతలంపుఁ గలుగ న్నా కిమ్ము నారాయణా! 91