పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/294

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనుపపోతును మావటీఁడు శిక్షించిన
నడచునే మదవారణంబు వలెను?
పెద్దపిట్టను మేఁతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి
సాగునే వేఁటాడు డేఁగ వలెను?
తే. కుజనులను దెచ్చి నీ సేవ కొరకుఁ బెట్ట
వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 57

సీ. నిగమాదిశాస్త్రముల్‌ నేర్చిన ద్విజుఁడైన
యజ్ఞకర్తగు సోమయాజియైన
ధరణిలోపలఁ బ్రభాత స్నానపరుడైన
నిత్య సత్కర్మాది నిరతుఁడైన
నుపవాస నియమంబులొందు సజ్జనుఁడైనఁ
గావివస్త్రము గట్టు ఘనుఁడునైనఁ
దండిషోడశ మహాదానపరుండైన
సకల యాత్రలు సల్పు సరసుఁడైన
తే. గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న
మోక్షసామ్రాజ్య మొందఁడు మోహనాంగ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 58

సీ. పక్షివాహన! నేనుబ్రతికినన్ని దినాలు
కొండెగాండ్రను గూడి కుమతినైతి
నన్నవస్త్రము లిచ్చి యాదరింపుము నన్నుఁ
గన్నతండ్రివి నీవె కమలనాభ!
మరణ మయ్యెడినాఁడు మమతతో నీ యొద్ద
బంట్లఁ తోలుము ముందు బ్రహ్మజనక!