పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తస్థుండవై వేణురం
ధ్రాలిన్‌ రాగరసంబు నిండ విలసద్రాగంబు సంధించి గో
పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు, నారాయణా! 49

శా. రాణించెన్‌ గడు నంచు నీసహచరుల్‌ రాగిల్లి సోలంగ మీ
వేణుక్వాణము వీనులం బడి మనోవీథుల్‌ బయల్‌ముట్టఁగా
ఘోణాగ్రంబులు మీదిఁ కెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో
శ్రేణుల్‌ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు, నారాయణా! 50

మ. పసులంగాపరి యే మెఱుంగు మధురప్రాయోల్లసద్వృత్తవా
గ్విసరారావము మోవి దా వెదురుగ్రోవిం బెట్టినాఁ డంచు నిన్‌
గసటుల్‌ సేయఁగ నాఁడు గోపిక లతద్గానంబులన్‌ మన్మథ
వ్యసనాసక్తులఁ జేయుచందములు నే వర్ణింతు, నారాయణా! 51

మ. జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసెన్‌ శైలంబు మాచేతులం
దిడు మన్నన్‌ జిరునవ్వుతో వదలినన్‌ హీనోక్తి గీపెట్ట నె
క్కుడు గోవుల్‌ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్‌
గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా! 52

మ. లలితాకుంచితవేణియం దడవిమొల్లల్‌ జాఱ ఫాలస్థలిన్‌
దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్‌ దీపింప లేఁజెక్కులన్‌
మొలకన్నవ్వుల చూపు