పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/270

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. గౌతమీస్నానానఁ గడతేఱుద మఁటన్న
మొనసి చన్నీళ్లలో మునుఁగలేను
తీర్థయాత్రలచేఁ గృతార్థుఁ డౌద మఁటన్న
బడలి నేమంబు లే నడుపలేను
దాన ధర్మముల సద్గతిని జెందుదమన్న
ఘనముగా నా యొద్ద ధనము లేదు
తపమాచరించి సార్థకత నొందుదమన్న
నిమిషమైన మనస్సు నిలుపలేను
తే. కష్టములకోర్వ నాచేతఁగాదు నిన్ను
స్మరణ చేసెద నా యథాశక్తి కొలఁది
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 9

సీ. అర్థివాండ్రకునీక హానిఁ జేయుటకంటెఁ
దెంపుతో వసనాభిఁ దినుట మేలు
ఆఁడుబిడ్డల సొమ్ములపహరించుటకంటె
బండఁ గట్టుక నూతఁ బడుట మేలు
పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె
బడబాగ్ని కీలలఁ బడుట మేలు
బ్రతుకఁ జాలక దొంగపనులు చేయుటకంటెఁ
గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు
తే. జలజదళనేత్ర నీ భక్తజనులతోడి
జగడమాడెడు పనికంటెఁ జావు మేలు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 10

సీ. గార్దభంబునకేల కస్తూరి తిలకంబు?
మర్కటంబునకేల మలయజంబు?