పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

చుట గలదుగాన నిట్టి భావసామ్యములు కవినిర్ణయమున కుపకరింపవని మా యాశయము.

ఈశతకమునందలి 104 వ పద్యమువలనఁ గవి యీశతకమును అదిదశకము, అవతారదశకము, దివ్యరూపదశకము, నామదశకము, కృష్ణావతారవింశతి, జ్ఞానవింశతి, మోక్షవింశతి యని విభాగము గావించినటులఁ దెలియుచున్నది. వ్రాఁతప్రతులయందుఁ బద్యములవరుస తప్పుపడియున్నది. ముద్రిత ప్రతియందు నూఱుపద్యములె కలవు. ఇతరప్రతులందుఁ గొన్నిటఁ గొన్ని పెచ్చుపద్యములు గానవచ్చుచున్నవి. ప్రతిపద్యమునకుఁ బాఠభేదములు పెక్కుచూపట్టుచున్నవి. ప్రత్యంతరసహాయమునఁ గవిభావముల కనుసరించుపాఠములనె యిందుఁ దీసికొంటిమి. ప్రత్యంతరములనుండి యింక నైదు పద్యములను సమకూర్చితిమి. ఇంకను బ్రత్యంతరముల శోధించినచోఁ గొన్ని క్రొత్తపద్యములు లభింపవచ్చును. శతకప్రతులయందుఁ బద్యముల వరుస భిన్నముగా నుంట దశకానుసారముగాఁ బద్యములను విడదీయ వీలులేకపోయినది. భావి