పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

శతకము వీరభద్రవిజయరచనానంతరము పూర్తిచేయఁబడినటుల విశ్వసింపఁజనును.

నారాయణశతకము దేశమున మిగుల వ్యాప్తి నొందినశతకములలో నొకటి. దీనిప్రత్యంతరము లాంధ్రదేశమునందలి యన్నిభాగములలో లభించు చున్నవి. అందెందును గవి యెవరొ యెఱుంగనగు నాధారములు గానరావు. వెల్లంకి తాతంభట్టు, కస్తూరిరంగకవి యీశతకమును దమలక్షణగ్రంథములలో నుదాహరణము దీసికొనిరి గాన నీశతకము పదునేనవశతాబ్దమునాఁటి వ్యాప్తిలో నున్నటులఁ దలంపవచ్చును. లాక్షణికవిరుద్ధములగు లోపము లీశతకమునందుఁ జాలగలవు. ఒకటిరెండుదక్క మిగిలినతెగదోషములు భాగవతమునందు లేనివిగాన నిది పోతనకృతము కాదేమోయని సంశయింప వీలు కలుగుచున్నది. శ్రీకృష్ణునిశృంగారచర్యలు భాగవతానుసారముగ నీకవి కొన్ని పద్యములందుఁ జేర్చెను. శ్రీకృష్ణలీలలను వర్ణించు ప్రతికవియుఁ దెలిసి కొన్ని తెలియక కొన్ని భాగవతదశమస్కంధభావములు కృష్ణకర్ణామృతభావములు సంగ్రహిం