పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/581

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

91


మునిగినారు. 1891-92 లో మద్రాసు ప్రభుత్వమువారు ప్రకటించిన '40 సంవత్సరముల అభివృద్ధి'యను నివేదికలోనే ఆనాటికి రైతులఋణభారము 29 కోట్లుండెనని ఒకకాకుల లెక్క వేసినారు. తరువాత సెంట్రల్ బ్యాంకింగు విచారణసంఘము వారిది 1931 నాటికి 150 కోట్లనిఅంచనా వేసినారు. దీనికొరకు నియమింపబడిన. సత్యనాధన్ ఐ.సి.ఎస్.గా రిది 200కోట్లనినారు. నేడు యావద్భారతదేశ రైతులపైన వేయికోట్లు పైగా ఋణభారము పడినది. దీనివడ్డీలు చెల్లించుకోలేక బాధపడచున్నారు.

నాలుగవ పరిచ్ఛేదము:

బ్రిటీషు ప్రభుత్వయంత్రము.

I

బిటిష్ పార్లిమెంటు సర్వాధికారము

భారతదేశము ఆంగ్లేయవర్తక కంపెనీవారికి చేజిక్కక పూర్వము 1600 వ సంవత్సరమునుండి మద్రాసు, సూరతు, బొంబాయి మొదలగు రేవు పట్టణములలో వారు స్థాపించిన (ఫ్యాక్టరీ) వర్తకస్థానములందు పనిచేయుచుండిన గుమాస్తాలు ఏజంట్లు మొదలగు ఉద్యోగులును, ఆవర్తకస్థానముల వ్యవహారములను నిర్వహించుటకు ఏర్పరుపబడిన ప్రెసిడెంట్లు లేక గవర్నరులును. వారికి సలహానిచ్చుటకు కంపెనీలోని అనుభవజ్ఞులగు ఉద్యోగులతో నిర్మింపబడిన కార్యాలోచన సంఘములు (కౌన్సిళ్లు)ను, నేటి బ్రిటిషుప్రభుత్వములోని ఐ. సి. యస్.