పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/528

ఈ పుట ఆమోదించబడ్డది

38

భారతదేశమున


గూడ రానీయక, వారి బిళ్ళబంత్రోతులను కాపలాయుంచి మౌనవ్రతులై, అధికార రోగపీడిత బధిరాంధక శవములవలె నుండు పద్దతి యింకను జరుగుచునేయున్నది. వీరినిజూచి ప్రజలు భయపడుచునేయున్నారు. ప్రజలకు క్షేమముకలుగ వలెనన్నచో నీ దుష్టవిధానము పోవలెను. ఈ యుద్యోగులెల్లరు తమ పర్యటనములందు తమ తమ కార్యాలయములు చేయు పనియు, అందువలన ప్రజలు పొందతగిన సహాయమునుగూర్చి తెనుగున ప్రతిగ్రామములోకూడా ఉపన్యసింపవలెననియు ప్రజ లడుగు ప్రశ్నలన్నిటికిని వీరు తెనుగున సమాధానము జెప్పవలెననియు, ఇందుకొర కొక దినచర్యపుస్తకముంచవలెననియు దానిని పై యధికారులు తనిఖీ చేయుచుండవలయుననియు, జీతవృద్ధులందు ప్రమోషనులందు నీ దినచర్యల పుస్తకములను బట్టి వీరుచేసినట్లు కనబడు ప్రజాసేవయే వీరి యర్హతకు సాక్ష్యముగా గైకొనబడునట్లు ఉద్యోగ నిబంధనలను మార్చవలెను. అట్లుచేసినగాని నిరంకుశ సంప్రదాయమునందు మెలగిన ఈ "దొరలు" ప్రజలకు నిజముగా సేవజేయరు. నేటి వార్షికనివేదికలవలె కేవలము బూటకపు కార్యక్రమముల వివరణగాకుండా నిజముగా వీరు సరిగా పనిచేసి ప్రజాసేవ చేయుచున్నారోలేదో కనిపెట్టి చర్య గైకొనుటకు మంత్రులు వీరిపనిని తనిఖీచేయుటకు ప్రత్యేకముగా కొందరుద్యోగులను నియమించవలెను. అంతటితో తృప్తిజెందక దేశ ప్రజలయొక్క క్షేమలాభముల కొఱకు పనిచేయు రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీలకుగూడ ప్రభుత్వశాఖలందలి అన్ని వ్యవహారములను