పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/406

ఈ పుట ఆమోదించబడ్డది

382

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మునకు విప్లవోద్యమమునకు కారణభూతులని చిత్రచిత్ర కథలెల్ల ఈనివేదికలో వ్రాయబడెను. ఈ నివేదికలో ఈవిప్లవోద్యమమును కూకటివ్రేళ్ళతో నిర్మూలించి దీనితోపాటు రాజద్రోహ మనునది లేకుండా చేయుటకు మాత్రమే గాక ప్రభుత్వము పట్ల ద్వేషభావము విరోధభావము వర్ధిల్లచేయు అభిప్రాయములతో పాటు సామాన్య రాజకీయాభిప్రాయములు గూడా నిర్మూలనము చేయగల తీవ్రనిర్బంధ శాసనములను జేయవలెనని ఈ కమిటీవారు సలహానిచ్చిరి. అంతట కనివిని యెరుగని దారుణ నిర్బంధ ప్రయోగములు తీవ్రనిషేధములు నిరోధములు కఠినశిక్షలతోను తరువాత 1932 లో చేయబడిన ఆర్డినెన్సులలోవలెనే చిత్రవిచిత్రములుగా సృజింపబడిన నిబంధనలతోను రెండుచట్టములు చేయబడెను. దేశప్రజల ప్రాతిపదికహక్కులను నిర్మూలనముజేసి దేశములో ప్రజాభిప్రాయముగాని రాజకీయ సంస్కరణోద్యమముగాని లేకుండచేయగల ఈ ఘోరచట్టములు రద్దుజేయవలసినదని ప్రజలు రాజకీయనాయకులు ఎంత మొరపెట్టినను ప్రభుత్వము వారు వినిపించుకొనలేదు.

II

ఖూనీబాగ్

దక్షిణాఫ్రికా సత్యాగ్రహ నాయకుడు సబర్మతీ సత్యాగ్రహ ఆశ్రమస్థాపకుడు నగు గాంధిమహాత్ముడు ఈ అన్యాయపు బిల్లులనుగూర్చి గొప్ప ప్రచారముచేసి వీనిని నిరోధించుటకును రద్దుపరచుటకును పూనుకొని నడుముగట్టి