పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/396

ఈ పుట ఆమోదించబడ్డది

372

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ప్రభుత్వచర్యలను నిరసించుచుండెను. ముజఫర్‌పూరు హత్యలనుగూర్చి తిలకుగారు వ్రాసినవ్రాతలకు ప్రభుత్వమువారు ఆయనను పట్టుకొని రాజద్రోహమునకు శిక్షించి అరుసంవత్సరములు ప్రవాసమంపిరి.

పంజాబులోకూడా విప్లవోద్యమము 1907 నాటికే వర్ధిల్లెను. వలసకేగిన భారతీయులపట్ల ఆంగ్ల ప్రభుత్వము ద్రోహముచేసినదను ప్రచారము జరిగెను. పోలీసువారిని సైనికులను తిరుగుబాటు గావింపుడని అచ్చటి నాయకులు కొందరు ప్రోత్సహింపసాగిరి. ఈ ఉద్యమము నరికట్టుటకు ఈ ప్రభుత్వమువా రచ్చటగూడ తీవ్ర నిర్బంధశాసన ప్రయోగము జేసిరి. లాలాలజపతిరాయిగాని, అజితసింగును 1818 రెగ్గ్యులేషనుక్రింద పట్టుకొని విచారణలేకుండా చెరపట్టి ప్రవాసమంపిరి. ఆరోజులలో ఈతీవ్రజాతీయవాదము విప్లవవాదము దారుణవాదమును ఇంగ్లాండులోని భారతీయులలో గూడా వర్థిల్లెను. అచ్చట శ్యాంజీ కృష్ణవర్మ స్థాపించిన ఇండియా హౌసులో విప్లవోపదేశములు జరిగెను. 'భారతదేశ స్వాతంత్ర్యయుద్ధ గ్రంథ' కర్తయగు సవర్కారుప్రభృతులు దానిలో సభ్యులు. ఇంగ్లాండులోకూడా 1909 లో ఇరువురు తెల్లవారు హత్యగావింపబడిరి.

ఈ సమయమున ప్రభుత్వమువారు వంగరాష్ట్ర యువకుల నెల్లరను పట్టివేయవలయునని ప్రయత్నించుచుండగా కలకత్తాలో “మణిక్తలా" కోటలో బాంబులుచేయు ఫ్యాక్టరీ బయలుపడెను. అంతట చాలామంది యువకులను పట్టుకొని చక్రవర్తిపైన యుద్ధముచేయ ప్రయత్నించిరనియు కుట్రచేసి .