పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/392

ఈ పుట ఆమోదించబడ్డది

368

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


లోకమాన్యుడును అగు తిలకుమహారాజునే సంకెళ్లువేసి కోర్టుకు తెచ్చి నిలువ బెట్టగా ఇక సర్వోత్తమరావుగారి మాట చెప్పనేల? అరెస్టులో నుండగా నీయనకు తిండిపెట్టువారు లేరైరి. నీవాయని పలుకరించువారులేరైరి. ఆనాడు ఒకరిద్దరు న్యాయవాదులు జాతీయవాదులుగా నున్నారను నెపమున ఇళ్లు సోదాలు చేసి భయపెట్టిరి. ఈ రాజద్రోహనేరమునకు ముద్దాయిల తరఫున పనిచేయుటకు ప్లీడర్లకు కూడా ధైర్యము లేకపోయినది. అంతట నీమండలమున తరువాత సుప్రసిద్ధ న్యాయవాదిగా పేరుపొందిన క్రైస్తవవకీలు జె. డీ. శామ్యూలుగారు ముద్దాయిల తరఫున ధైర్యముచేసి పనిచేసిరిగాని శిక్ష తప్పలేదు. ఈ రాజద్రోహకేసులో ప్రభుత్వము తరఫున పనిచేసి నందు కొక ప్లీడరుగారికి జిల్లామునసబు ఉద్యోగము నిచ్చి గౌరవించిరి. ఆహా ! ప్రభుత్వపరిపాలనలోని నిరంకుశసంప్రదాయములును దేశభక్తుల బాధలును నాటికిని నేటికిని ఒకేరీతిగా నున్నవి గదా !

పదుగురతో చావు పెండ్లితోసమానమను మాట నిజము. కాంగ్రెసుయొక్క బలము, మహాత్మునియొక్క సారథ్యము పత్రికలయొక్క విమర్శలు ప్రపంచప్రజాభిప్రాయమును చేయూతగాగలిగి శాంతిసమరమును చేయుచున్న ఈరోజులలో సామాన్యునికిగూడ ప్రభుత్వముతో సాత్వికనిరోధముచేసి, చెరకేగు ధైర్యము కలుగుటలో నాశ్చర్యములేదు. ఇట్టిబలము సానుభూతియు సారథ్యము లేనినాడు దేశములో సంచలనము లేనినాడు నీవా యని పలుకరించువారు లేనినాడు ఒంటరియై