పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/387

ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

363

వందేమాతర జూతీయోద్యమమిట్లు తీవ్రముగా పెరుగుచుండగా దీనిని అణచుటకు ప్రభుత్వము తీవ్రనిర్బంధవిధానమును ప్రయోగింపసాగెను. పత్రికలపైనను వ్యక్తులపైనను సభలపైనను నిషేధములు ప్రయోగించిరి. ఇట్లు ప్రజల అభిప్రాయ ప్రకటనయు సమావేశస్వాతంత్ర్యము నణచివేయబడెను. అనేక సంస్థలను అశాస్త్రీయ సంఘములుగా అణచివేయు శాసనము గూడ గావింపబడెను . 1907 లో బారిసాలులో జరిగిన రాజకీయసభను అక్రమసంఘముగా ప్రకటించి అచ్చటి సభవారిని పోలీసువారు లాటీలతో తీవ్రముగా కొట్టి చెదరకొట్టిరి. అనేకులకు చావుదెబ్బలు తగిలెను. ఇదియే మన దేశములో జరిగిన మొదటి లాటీచార్జి. స్వరాజ్యము కోరినందుకు సురేంద్రనాథ బెనర్జీగారిపైన రాజద్రోహనేరమునుమోపిరి. గాని కలకత్తా హైకోర్టులో శారదాచరణమిత్రయను భారతీయ న్యాయాధిపతి స్వరాజ్యము కావలెననుట రాజద్రోహము కాదని ఆ కేసును కొట్టివేసెను.

1907 లో కాంగ్రెసు నాగపూరులో జరుగవలసి యుండెను. గోఖలే సర్‌ఫిరోజిషా మెహతాలు నాటి కాంగ్రెసులో ప్రముఖులు. వీరెల్లరు ప్రభుత్వముపట్ల వినయ విధేయతలతో మెలగవలెనను అభిప్రాయముగల మితవాదులు. . వీరు కాంగ్రెసుకు రసవిహారీఘోషు నధ్యక్షత వహింప జేయదలచిరి. ఇది తీవ్రజాతీయవాదులకును యువకులకును ఇష్టములేదు. ప్రవాసమంపబడిన లజపతిరాయిగారినే అధ్యక్షునిగా చేయగోరిరి. మితవాదులు నాగపురములోమానివేసి సూర