పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/366

ఈ పుట ఆమోదించబడ్డది

342

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


దట. 1878 లో నితడు బొంబాయి మద్రాసులు తిరిగి రాజకీయప్రచారము గావించినాడు. చెన్నపట్టణమునందు 1881 లో స్థాపింపబడిన “మహాజనసభ" ప్రజలరాజకీయ హక్కులకొరకు కృషిచేయుట ప్రారంభించినది. ఈ సంఘమువారు 1884 లో నొక రాజకీయ మహాసభను జరిపిరి. .

ఈ పరిస్థితులలో 1883 లోనే “ఇల్బర్టు" గారు భారతీయ మేజస్ట్రీటులకు ఐరోపాజాతి వారిని కూడ విచారించి శిక్షించుట కధికార ముండవలెనను చిత్తుశాసనము (బిల్లు) నొకదానిని శాసనసభలో ప్రవేశపెట్టిరి. అంతట నాంగ్లేయు లెల్లరు ఏకమై దేశములో నన్ని ప్రదేశములందును సభలుచేసి అసమ్మతి తీర్మానములు గావించి గొప్ప ఆందోళనము గావించిరి. ఈ జాతీయగర్వము భారతీయులకు దుస్సహమగుటయే గాక, వారి ఐకమత్యము వారి ఆందోళనపద్దతులు, చూడగా భారతీయులకు ఆశ్చర్యముకలిగెను. దాని ఫలితముగా జిల్లా మేజస్ట్రీటులకు జిల్లాజడ్జీలకు మాత్రేమే అట్టి యధికారముండు నట్లు బిల్లు సవరణ చేయబడగా భారతీయుల కది యొక గుణపాఠమయ్యెను.

1883 లోనే కలకత్తాలో నొక గొప్ప రాజకీయసభ జరిగెను. ఇది ఆల్బర్టు హాలులో జరిగినది. ప్రథానవక్తలు సురేంద్రనాథ బెనర్జీ, ఆనందమోహనబోసు గార్లు. ఢిల్లీ దర్బారులో నాంగ్లేయ ప్రభుత్వముపట్ల భక్తి గలవారెల్లరు సమావేశ మయినట్లే మన దేశముపట్ల భక్తిగలిగి దాని శ్రేయముకొరకు పాటుబడు సంఘసంస్కర్తలు రాజకీయ