పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/210

ఈ పుట ఆమోదించబడ్డది

186

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


తప్ప తక్కిన దంతయు అబద్దమని తేలినది. 1830 నాటి కీ బాకీ పరిష్కరింపబడెను. పూర్వము తీర్మానింపబడిన బాకీలుకూడా, సరిగా విమర్శింపబడినచో నందులో చాల భాగమబద్దమని తేలియుండును.

బెన్ ఫీల్డును రెండుమార్లు ఉద్యోగము నుండి తొలగించినను అతడు తన పలుకుబడి నుపయోగించి మరల నుద్యోగము సంపాదింపగలిగెను. తరువాత కార౯ వాలిసు గవర్నరు జనరలుగా వచ్చినపిదప 1788లో నితనిని బలవంతముగా సీమ కంపివేసెను. అంతట నితడు పార్లమెంటులోనే పలుకుబడి సంపాదించి పనిచేయసాగెను. బెన్‌ఫీల్డును, ఇతనివలెనే అన్యాయార్జిత ధనముతో కుబేరుడైన అట్కి౯ స౯ అనునతడును, ఇంకను గొందరును ఏకమై భారతదేశములో జరుపుచున్న అన్యాయములనుగూర్చి బర్కు మహానీయుడు పార్లమెంటులో ప్రసంగించి తాను వార౯ హేస్టింగ్సు పైన నేరారోపణ చేయబోవుచున్నాననియు అయోధ్యరాష్ట్ర విభజనకును, ఆర్కాటు నవాబు ఋణములకును సంబంధించిన కాగితములను బయల్పరుపవలసినదనియు ప్రవేశపెట్టిన తీర్మానము నోడించివైచిరి. పిట్టు డండాసులు తీర్మానించినబాకీ నిజముగా కంపెనీ నౌకరు లక్రమముగా పై విధముగా బనాయించిన బాకీలే. దీని వడ్డీభారము సాలుకు 623000 పౌనులుగా నుండెను – అనగా కంపెనీవారికి , సాలియానా వచ్చులాభములకు రెట్టింపుగానుండెను. .

ఆనాడు క్రిందివానిమొదలు పై వానివరకు, కంపెనీనౌకరులు లంచములు పుచ్చుకొనుట కలవాటుపడి యుండిరి. పిగట్టు