పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

176

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నాక్రమింపవలెనని అయోధ్యనవాబు సుజాఉద్దౌలా యాశ. గాని 80 వేల రోహిలా శూరులనుజూచి భయపడెను. ఇట్టి స్థితిలో నింగ్లీషు సైన్యమును వారన్ హేస్టింగ్సు సుజాఉద్దౌలా కిచ్చి అతనివల్ల 4 లక్షల నవరసులు పుచ్చుకొనెను. దీనితో తన సైన్యమును జేర్చి నవాబు రోహిలఖండమును దోచి, ప్రజలను హింసించి, ఇండ్లు తగులబెట్టి, యా దేశమును నాశనముజేసెను. ఇట్టి చర్యలవలన హేస్టింగ్సు రెండు సంవత్సరములలో పదిలక్షల నవరసుల రొక్కమును కంపెనీకి జేర్పుటయేగాక సాలు ఆదాయమును 450000 నవరసులకు పెంచెను. ఇదిగాక ప్రతిసాలున వంగరాష్ట్రరక్షణకు ఖర్చుపెట్టవలసిన 250000 నవరసులను అతడు పొదుపుచేసెను.

నందకుమారుడు ధనవంతుడు, తెలివైనవాడు, గౌరవ కుటుంబమునకు జెందినబాహ్మణుడు. వార౯ హేస్టింగ్సు మూడేండ్లలో 40లక్షల రూపాయలు లంచములు పుచ్చుకుని ఘోర అన్యాయములు చేసెనని యితడు కౌన్సిలువారికొక అర్జీ నిచ్చి అతనిపైన నేరారోపణ గావించెను. తన కౌన్సిలుకు హేస్టింగ్సు జవాబు చెప్పలేకపోయెను. ఇక నీ బాహ్మణుడు బ్రతికియున్నచో తనకొంప మునుగునని భయపడి హేస్టింగ్సు అతనిని నాశనముచేయ నిశ్చయించి నందకుమారుడు పూర్వ మేదో యొక కూటసృష్టి, (ఫోర్జరీ) చేసెనను నేరమునుమోపి అతనినరెష్టు చేయించెను. వారన్ హేస్టింగ్సుయొక్క అప్తుడైన న్యాయాధిపతియగు సర్ ఎలిజా ఇంపే ఆంగ్లేయ ప్రమాణపురుషుల (జూరీ) సహాయముతో నీ బాహ్మణుని విచారించి ఉరి